Repo Rate Cut: బ్రేకింగ్ న్యూస్ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
RBI MPC Meeting Decisions April 2025: ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన రెండో ద్రవ్య విధాన కమిటీ, రెపో రేటును 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

RBI MPC Meeting April 2025 Outcomes: RBI MPC Meeting April 2025 Outcomes: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), దేశంలోని రుణగ్రహీతలకు 'రెండోసారి' ఊరట కల్పించింది. బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటును 0.25 శాతం (0,25%) లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా, ఇప్పుడు, రెపో రేటు పావు శాతం తగ్గుతుంది. అంటే, రెపో రేట్ ప్రస్తుతం ఉన్న 6.25 శాతం నుంచి ఇప్పుడు 6.00 శాతానికి దిగి వస్తుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, కార్పొరేట్ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గుతాయి. RBI MPC ఫలితాలను కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI New Governor Sanjay Malhotra) ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా, మొదటిసారి, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది, అప్పుడు రేట్లు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి చేరాయి.
కేంద్ర బ్యాంక్ తన విధాన వైఖరిని న్యూట్రల్ (NEUTRAL) నుంచి అకామడేటివ్ (ACCOMMODATIVE)కు మార్చుకుంది. పరిశ్రమలకు, ముఖ్యంగా MSMEలకు ఇది పెద్ద పాజిటివ్ న్యూస్.
దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని కూడా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. 2025-26లో - Q1లో 3.6 శాతం, Q2లో 3.9 శాతం, Q3లో 3.8 శాతం & రియు Q4లో 4.4 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది.
అయితే, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.5 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరిలో అంచనా వేసిన 6.7%తో పోలిస్తే ఇది 20 బేసిస్ పాయింట్లు తగ్గింపు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

