By: ABP Desam | Updated at : 07 Nov 2021 01:32 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సీనియర్ సిటిజన్లు
సురక్షితమైన పెట్టుబడి సాధనాల గురించి ఆలోచిస్తే మొదటిగా తట్టే ఆలోచన ఫిక్స్‌డ్ డిపాజిట్లు. కానీ ఇప్పుడేమో డిపాజిట్లపై వడ్డీని తక్కువగా ఇస్తున్నారు. రానురాను వడ్డీరేట్లు మరింత తగ్గిపోయే సూచనలు ఉండటంతో చిన్న పొదుపు పథకాల్లో డబ్బు దాచుకొనేవారు ఆందోళన పడుతున్నారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లపై తక్కువ వడ్డీరేట్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే కొన్ని బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు పోటీదారుల కన్నా ఎక్కువ వడ్డీరేటును వర్తింప జేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాలపరిమితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఈ డిపాజిట్లపై డీఐసీజీసీ బీమా ఉండటంతో భద్రతకు ఢోకా లేదు.
ప్రైవేటు రంగ బ్యాంకుల్లో యెస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందరికన్నా ఎక్కువ వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక ఆర్‌బీఎల్ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. మూడేళ్ల డిపాజిట్లపై 6.8 శాతం వరకు వడ్డీరేటును అమలు చేస్తోంది. ఇండస్‌ఇండ్ బ్యాంకూ 6.50 శాతం వడ్డీని అందిస్తోంది. డీసీబీ బ్యాంకు కూడా ఫర్వాలేదు. మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ ఇస్తోంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్ సైతం 6.25 శాతం వడ్డీని అందిస్తోంది.
మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.80 శాతం వడ్డీ రేటు ఇస్తున్నాయి.
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్
Gold-Silver Prices Today 05 Nov: నగలు కొనేవాళ్లకు కలిసొస్తున్న కాలం, తగ్గిన పసిడి రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ
Jeevan Pramaan Patra: లైఫ్ సర్టిఫికెట్ల ప్రాసెస్ ప్రారంభం - ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి?
Bank Loan: ఫ్లెక్సీ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ Vs పర్సనల్ లోన్ - ఏ అవసరానికి ఏది ఉత్తమం?
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!