Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
ఏడాది క్రితం రూ.4గా ఉన్న ఈ కంపెనీ షేరు ఇప్పుడు రూ.75గా ఉంది. ఒకే ఏడాదిలో లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చింది.

బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) స్టాక్ మదుపర్లకు లాభాల పంట పండించింది. ఏడాదిలోనే 1705 శాతం రాణించింది. బీఎస్‌ఈలో 2020, నవంబర్ 4న రూ.4.18 ఉన్న ఈ షేరు 2021, నవంబర్ 4న రూ.75.40 వద్ద ముగిసింది. అంటే ఏడాది క్రితం ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.18.03 లక్షలు చేతికి అందేవి. ఇదే సమయంలో సెన్సెక్స్ 47.89 శాతమే రాణించడం గమనార్హం.
ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ షేరు రూ.90.55 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో షేర్ల ధర కరెక్షన్‌కు గురైంది. దీపావళి ముహురత్ ట్రేడింగ్ సెషన్‌లో 2.78 లక్షల షేర్లు చేతులు మారాయి. వీటి విలువ రూ.2.10 కోట్లుగా ఉంది. ఇక ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ మార్కెట్ విలువ రూ.7,853 కోట్లుగా ఉంది.
బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు ఈ ఏడాది ఆరంభం నుంచి 1002 శాతం పెరిగాయి. ఒక్క నెలలోనే 17 శాతం ర్యాలీ చేశాయి. ప్రస్తుతం బ్రైట్‌కామ్ షేరు 5, 20, 50, 100, 200 రోజుల మూవింగ్ యావరేజెస్ కన్నా ఎక్కువగానే ఉంది. ఈ కంపెనీ ఏఎస్‌ఎం పరిధిలో ఉండటంతో మదుపర్ల పెట్టుబడులకు రక్షణ ఉంటుంది. షేరు ధర ఐదు శాతం మించి పడిపోదు. కంపెనీలో ప్రమోటర్లకు 22.40 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్లకు 77.60 శాతం వాటా ఉంది.
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

