Money On Road: ఆ రోడ్డుపై ఎక్కడ చూసినా డబ్బే డబ్బు.. దొరికినోళ్లకు దొరికినంత!
ఆ రోడ్డుపై ఎక్కడ చూసినా డబ్బే.. దీంతో చేతికి అందినంత డబ్బును తీసుకుని జనాలు వెళ్లిపోయారు. వారి కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు.
డబ్బు సంపాదించడమంటే అంత ఈజీ కాదు. ఇందుకు బాగా శ్రమించాలి.. లేదా తెలివితేటలతో పైకిరావాలి. అప్పుడు బోలెడంత డబ్బును వెనకేసుకోవచ్చు. కానీ, కొందరు.. అవేవీ చేయకూండా రాత్రికి రాత్రి డబ్బు వచ్చేస్తే బాగుంటుందని కలలుగంటారు. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బుల కట్టలు దొరికితే బాగుంటుందని కోరుకుంటారు. లేదా లాటరీ టికెట్ తగలాలని అనుకుంటారు. కానీ, అదంతా సాధ్యమా? కానే కాదు కదూ. దానికి లక్ కూడా కలిసిరావాలి.
అమెరికాలోని కార్ల్స్‌బాద్‌లో ఇంటర్‌స్టేట్-5 రోడ్డులో ప్రయాణించివారిని అదృష్టం వరించింది. అటుగా వెళ్తున్నవారికి రోడ్డుపై బోలెడన్ని డబ్బులు కనిపించాయి. ఆ రోడ్డు మీదుగా వెళ్లిన ఓ ట్రక్కు నుంచి డబ్బుల సంచులు జారి రోడ్డుపై పడ్డాయి. దీంతో ఎక్కడ పడితే అక్కడ డబ్బులే డబ్బులు. అంత డబ్బు చూసిన తర్వాత జనాలు ఆగుతారా.. కేరింతలు కొడుతూ.. తమ సంచులు నింపుకున్నారు. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ డెమీ బ్యాగ్బే ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రమ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇందులో జనాలు రోడ్డుపై పడిన డబ్బులను తీసుకొనేందుకు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. అంత డబ్బును ఒక్కసారే చూసేసరికి వారి ఆనందానికి అవధుల్లేవు. మనకు కూడా అంత డబ్బు దొరికితే భలే బాగుంటుందని అనిపిస్తోందా?
View this post on Instagram
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క కుదిర్చారు!
అంత డబ్బు రోడ్డుపైకి ఎలా వచ్చింది?: ఓ బ్యాంక్ నుంచి ఫెడరల్ రిజర్వ్‌కు డబ్బును తీసుకెళ్తున్న ట్రక్కు డోరు కానన్ రోడ్డుపై ఒక్కసారిగా తెరుచుకుంది. దీంతో అందులో ఉన్న డబ్బు చెల్లాచెదరుగా పడిపోయింది. దీంతో జనాలు వాటిని తీసుకొనేందుకు ఎగబడ్డారు. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ (CHP) అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. డబ్బును తీసుకున్న జనాలపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇందుకు FBIతో కలిసి పనిచేస్తున్నారు. డబ్బును తీసుకుంటున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు మాత్రం CHP అధికారులకు ఆ డబ్బును తిరిగిచ్చేశారు. అయితే ఈ డబ్బు కోసం రోడ్డు మధ్యలో వాహానాలు నిలిపిన డ్రైవర్లపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న వీడియోలను ఆధారంగా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు.
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..