అన్వేషించండి

Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana Latest News: తెలంగాణ రక్షణ కవచంగా ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్‌ఎస్, కేసీఆర్‌పై కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.

Telangana Latest News: తెలంగాణ రక్షణ కవచంగా ఉన్న బీఆర్‌ఎస్‌ పెద్ద కుట్ర  జరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ  కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే సంబంధం లేని కేససుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మోదీ డైరెక్షన్‌లో ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా రేవంత్

ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు కవిత. ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతీ విషయంలో కూడా బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని అన్నారు. అందుకే ప్రతి విషయంలో కూడా బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని విమర్శించారు. 

కేసుల హెచ్చరిక ఉద్దేశం ఏంటీ?

వాస్తవాలు బయటపెడుతున్న తమపై బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని వాపోయారు కవిత. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని నిన్నటి ప్రధాని, సీఎం భేటీతో బట్టబయలైందన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించడం ఇందులో భాగమేనన్నారు. లేనిపోని విషయాలు తెచ్చి అంటగడుతున్నార ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కుటుంబ పాలన మీదా? మాదా?

అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి మారారని కవిత విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమని వివరించారు. తాము ఎప్పుడూ ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్‌ఛార్జి అని సీఎం చెప్పుకోవడమే వారి కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. పార్టీ పరంగా ఇన్‌ఛార్జి అయితే ఇబ్బంది లేదన్నారు కవిత. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రస్నించారు. కలెక్టర్ ఎదురెళ్లి తిరుపతి రెడ్డికి ఎందుకు స్వాగతం చెబుతున్నారని నిలదీశారు. రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా?  అని క్వశ్చన్ చేశారు. 

అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికైన తమ కుటుంబ సభ్యులు ప్రజాసేవ చేస్తున్నామని కవిత పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి సోదరులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడి  నర్సయ్య వంటి ఉన్న వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. 

సంబంధం లేని కేసుల్లో ఇరికించే ప్రయత్నం

ఇన్ని చేస్తూ తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్‌పై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. సంబందం లేని కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారు. భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. దుబాయ్‌లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చింది. వీటికి బీఆర్‌ఎస్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు కవిత. 

అప్పులపై అబద్దాలు

రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు కవిత. నెలకు రూ 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదని తెలిపారు. మరి 6500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్రమలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. 

Also Read: హైదరాబాద్‌లో 120 దేశాల సుందరీమణులు - మే 7 నుంచి 31వరకు అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు

అప్పుల్లోనే కాకుందా రాష్ట్రాదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. ప్రతీ నెల 18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నారని... కానీ కాగ్ ప్రకారం 12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదన్నారు. ఇలా అబద్దపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు? ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారని నిలదీశారు. 

హైడ్రా కారణంగా ఆదాయం డౌన్ 

రాష్ట్రంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అని నిందించారు కవిత. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే వచ్చింది కేవలం 5800 కోట్లేనన్నారు. ఇలా ఆదాయం పడిపోవడానికి కానీ హైడ్రా విధ్వంసమే కారణమని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని సర్వనాశనం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందన్నారు.  

ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి కొత్త విషయాలపై వినతులు ఇవ్వలేదన్నారు కవిత. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత జానా రెడ్డిని ముందుపెట్టి కాంట్రాక్టరుకు 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 30 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు 3340 కోట్లు అయితే 10 ఏళ్లలో కేసీఆర్ 3890 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు. సొంత జిల్లాలో సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారని , ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మండిపడ్డారు. 

ఉత్తరాఖాండ్‌లో టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడే ఉండి వారిని బయటకు తీశారని కవిత గుర్తు చేశారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి దేని మీదా సోయి లేదన్నారు. ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని సెటైర్లు వేశారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే స్పందించలేదని ఫైర్ అయ్యారు. 

Also Read: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget