అన్వేషించండి

Posani Krishna Murali Arrest: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం

Posani Krishna Murali Arrest:అనంతపురం పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా తరలించారు.

Film Actor Posani Krishna Murali Arrested: సినిమా నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్‌పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ని అరెస్టు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద అదుపులోకి తీసుకున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా సహకరించాలని అరెస్టు చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి తరలించారు.  

పోసానిపై పెట్టిన కేసుల వివరాలు ఇవే

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలో నమోదు అయిన కేసు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. పోసాని కృష్ణ మురళిని రాత్రి 8.45 నిమిషాలకు అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్టు తెలిపారు. కులాల పేరుతో దూషించి ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించినందుకు ఆయన్ని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఆయనపై 196, 353(2),111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇంట్లో పోలీసులతో వాగ్వాదం

పోసాని అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టు చేసేందుకు రాయదుర్గంలోని మైహోం భుజ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడ వారితో పోసాని వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళలో వచ్చి పోలీసులం అని చెబితే ఎలా నమ్మేది అని అన్నారు. అసలు అనుమతి లేకుండా తన ఇంటికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. దీనికి పోలీసులు కూడా ఘాటుగా స్పందించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వెళ్లొచ్చని అరెస్టు చేయవచ్చని అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు రమ్మని చెప్పండి.. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెగేసి చెప్పారు. లేకుంటే వేరేలా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేశారు. 

ఇంతలో పోసాని డైనింగ్ రూమ్‌కు వెళ్లి మందులు వేసుకున్నారు. భార్య మందులు ఇచ్చారు. ఏమైనా ఉంటే తమకు ఇవ్వాలని ఆయన భార్యకు పోలీసులకు సూచించారు. ఆయన ఆరోగ్యం గురించి తమకు వదిలేయాలని తాము చూసుకుంటామని అన్నారు. దీనికి ఆమె స్పందిస్తూ.... ఆయనకు ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో తెలియదని అన్నీ తానే ఇస్తానని చెప్పారు. ఏం భయపడవద్దని తాము చూసుకుంటామని అన్నారు. 

చంద్రబాబు, పవన్, లోకేష్‌పై వ్యక్తిగత విమర్శలు 

సినిమా నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. మొదట్లో టీడీపీకి సానుభూతిపరుడిగా ఉండే వారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత సైలెంట్‌గా ఉన్నారు. వైసీపీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన జగన్‌తో ట్రావెల్ చేశారు. 2019 కంటే ముందు నుంచి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శల హీట్‌ చేశారు. దీంతో ఆయన అనేక కేసుల్లో చిక్కుకున్నారు. వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడటంతోపాటు బూతులతో రెచ్చిపోయే వాళ్లు. 

పోసాని వైసీపీ సభ్యత్వం తీసుకోకపోయనా ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని ఆయన్ని ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చేశారు జగన్. పదవి వచ్చినప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయారు పోసాని. చంద్రబాబు, పవన్, లోకేష్‌ను ఇష్టారీతిన తిట్టడంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా  కేసులు పెట్టారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్లను టార్గెట్ చేసుకొని మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు సరే అధికారం కోల్పోయిన తర్వాత కూడా దూకుడుగా మాట్లాడుతూ కులాలు, మతాల పేేరు చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి. 

ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన పోసాని సన్నిహుతులు దూకుడు తగ్గించాలని సూచించారు. సన్నిహితుల సలహా మేరకు ఈ మధ్య కాలంలోనే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తానంటూ ప్రకటించారు. గతంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో ఆయన్ని అరెస్టు చేశారు.

Also Read: విపక్షంలో ఉన్నప్పుడు పనికొస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు కూలుస్తాయి- అసలేంటి స్ట్రాటజీ సంస్థల అసలు కథ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget