అన్వేషించండి

Miss World 2025: హైదరాబాద్‌లో 120 దేశాల సుందరీమణులు - మే 7 నుంచి 31వరకు అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు

Miss World 2025: మరో అతర్జాతీయ వేడుకకు వేదిక కానుంది హైదరాబాద్. ఏకంగా 120 దేశాల సుందరీమణులు పాల్గొనే మిస్ వరల్డ్ పొటీలు నిర్వహించి చరిత్రాత్మక , వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

Miss World 2025 competition in Hyderabad: మిస్ వరల్డ్ పోటీలు అంటే ప్రపంచంలోనే ఓ అరుదైన , అద్వితీయమైన వేడుక. వివిధ దేశాల నుంచి సుందరీమణులు పాల్గొనే ఈ వేడుకలకు ఈసారి తెలంగాణలోని హైదరాబాద్ వేదిక కానుంది. ప్ర‌పంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్ర‌పంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం అనే మాట వింటుంటేనే హైదరాబాద్‌ జోష్ పెంచుతుంది. ఒక్కసారి ప్రపంచం దేశాలన్ని హైదాబాద్ వైపు చూపుతిప్పుకునే ఆ రోజు అతి చేరువలోనే ఉంది. ఈ ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క మిస్ వ‌రల్డ్ పోటీలకు హైద‌రాబాద్‌లో చెయ్యాల‌ని నిర్వాహకులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో 72వ మిస్ వరల్డ్ పోటీల‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న‌ది. చారిత్ర‌క‌, వార‌స‌త్వ సంప‌దను ప్ర‌పంచానికి చాట‌డానికి తెలంగాణకు ఇదొక గొప్ప అవకాశం కానుంది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటేందుకు అరుదైన ఘట్టం కానుంది.

ఈ ఏడాది అందాల పోటీల‌కు అనువైన ప్రదేశంగా తెలంగాణను ఎంచుకోవడం, అందులోనూ హైదరాబాద్ వంటి మహానగరం ఈ వేడుకులకు సిద్దమవ్వడం ఈ ప్రభుత్వంలో జరిగే ఓ అద్వితీయం వేడుకగా చెప్పవచ్చు.

Miss World 2025: హైదరాబాద్‌లో 120 దేశాల సుందరీమణులు - మే 7 నుంచి 31వరకు అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు

ఈ ఏడాది మేనెలలో నాలుగు వారాల‌ పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతోపాటు గ్రాండ్ ఫినాలేను సైతం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ‌ స్వాగతం పలకబోతుంది. మే 7 నుంచి ఈ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ప్రస్తుత మిస్ వరల్డ్ తర్వాత అందాల సుందరి కిరీటాన్ని ఎవరు ధరిస్తారో గ్రాండ్ ఫినాలే రోజు తేలనుంది.

గతంలో న్యూఢిల్లీ, ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 71వ ఎడిషన్ ముంబైలోనే జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకల‌కు వేదికైంది. ఐటీ, ఫార్మాసూటికల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణకు ఈ అవకాశం దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయమే. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఇప్ప‌టికే ఆహ్వానాలు పంపుతోంది. గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అరుదైన వంటకాలు, విభిన్నమైన కళా వారతస్వమున్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని.. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ‌ కార్యదర్శి స్మితా సబర్వాల్ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసారు.

మిస్ ఇండియా పోటీలు అంటేనే సుందరీమణుల అలరిస్తారు. అందులోనూ మిస్ వరల్డ్ పోటీలు అంటే ఇంక మాటల్లో చెప్పక్కర్లేదు. ఎంత ఆహ్లదంగా ఉంటుంతో, అంతే స్థాయిలో వివిధ దేశాల యువతుల మధ్య గట్టిపోటీ కూడా సర్వసాధారణం. ఈ పోటీల వేదికగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని మరింత పెంచడంతోపాటు, ప్రపందేశాల ప్రతినిధులను ఆకట్టుకునేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Also Read: మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్​గా గెలిచిన ఇండియన్ బ్యూటీలు వీళ్లే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
HCU Lands Issue: ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
Bandi Sanjay: సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ బండి సంజయ్ ఆగ్రహం
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP DesamAniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
HCU Lands Issue: ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు- TGIIC కీలక ప్రకటన
Bandi Sanjay: సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
సన్న బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడంటూ బండి సంజయ్ ఆగ్రహం
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Hyderabad ORR Toll Charges: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీలు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Malaika Arora: క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
Betting Apps promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
Sardar 2 Movie: 'సర్దార్ 2'లో కార్తీ ఫస్ట్ లుక్ అదుర్స్ -  సీక్రెట్ సర్దార్ ఏజెంట్ వచ్చేస్తున్నాడు.. యుద్ధం వస్తే పోరాటమే!
'సర్దార్ 2'లో కార్తీ ఫస్ట్ లుక్ అదుర్స్ - సీక్రెట్ సర్దార్ ఏజెంట్ వచ్చేస్తున్నాడు.. యుద్ధం వస్తే పోరాటమే!
IIIT Allahabad Double Tragedy: అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Embed widget