Miss World and Miss Universe List from India : మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌గా గెలిచిన ఇండియన్ బ్యూటీలు వీళ్లే
Most Beautiful Womens in India : అందం, ఫ్యాషన్ ప్రపంచంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు ఉండే క్రేజే వేరు. అయితే ఇప్పటివరకు ఇండియా నుంచి ఎంతమంది ఈ అందాల పోటీల్లో విజేతలుగా నిలిచారో తెలుసా?
Miss World and Miss Universe Winners : మిస్ వరల్డ్ 2024 విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అందుకుంది. ముంబై వేదికగా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా ఈ అందాల పోటీలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో మొత్తం 112 దేశాలకు చెందిన భామలు పోడి పడ్డారు. భారత్ నుంచి సినీ శెట్టి పోటీలలో పాల్గొంది. అయితే గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన ఈ భామ 8వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అతి కొద్ది దూరంలో ఈ భామ మిస్ వరల్డ్ ట్రోఫీని పొందే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఇప్పటివరకు ఇండియా నుంచి కేవలం మిస్ వరల్డ్ మాత్రమే కాదు.. మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్న భామలెవరో ఇప్పుడు చుద్దాం.
ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండే చాలామందికి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మధ్య వ్యత్యాసం గురించి పెద్దగా తెలియదు. అయితే ఈ రెండూ కూడా బ్యూటీ ప్రపంచంలో అత్యంత విలువైన కిరీటాలు. మొదట్లో మిస్ వరల్డ్ పోటీలే జరిగేవి. తర్వాత కాలంలోనే మిస్ యూనివర్స్ పోటీలు జరగడం ప్రారంభమయ్యాయి. ఈ రెండు పోటీల్లోనూ ప్రపంచదేశాలకు చెందిన అందమైన భామలు పాల్గొంటారు. అయితే ఈ రెండు పోటీల్లో ఇప్పటివరకు మిస్ యూనివర్స్‌గా ఎందరు విజేతలయ్యారు.. మిస్ వరల్డ్‌గా ఎంతమంది అందగత్తెలు కిరీటాన్ని సంపాదించారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మిస్ యూనివర్స్ ఇండియా బ్యూటీలు వీరే.. (Miss World Universe Winners from India)
సుస్మితా సేన్
మిస్ యూనివర్స్‌గా 1994లో సుస్మితా సేన్ కిరీటాన్ని గెలుచుకుంది. 18 సంవత్సరాల వయసులో ఇండియా నుంచి మొదటి మిస్ యూనివర్స్‌గా కిరీటాన్ని సంపాదించి చరిత్ర సృష్టించింది. మిస్ యూనివర్స్ విజేతగా నిలిచిన తర్వాత పలు చలనచిత్రాల్లో నటించింది.
లారా దత్తా
లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ అయింది. ఇండియా నుంచి రెండవ మిస్ యూనివర్స్‌గా ఆమె పేరు సంపాదించుకుంది. లారా దత్తా మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసి.. నటనకు మంచి అవార్డులు సైతం అందుకుంది.
హర్నాజ్ కౌర్ సంధు
2021లో హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. చండీఘడ్‌కు చెందిన ఈ భామ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మూడవ భారతీయ మహిళ. దీనికి ముందు అనేక అందాల పోటీల్లో పాల్గొని.. అవార్డులు సొంతం చేసుకుంది. ఇదే దూకుడు, ఎక్స్‌పీరియన్స్‌తో మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లి టైటిల్‌ను దక్కించుకుంది. ఈ భామ కూడా బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తోంది.
మిస్ వరల్డ్ టైటిల్ విజేతలు (Miss World Crown Winners from India)
రీటా ఫరియా
రీటా ఫరియా ఇండియా నుంచి 1966 మొట్ట మొదటి మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. మెడికల్ స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో మోడలింగ్ వైపు ఆసక్తిని చూపించి.. అటు దిశగా అడుగులు వేసి.. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని ఇండియాను అందాల పోటీల్లో మొదటి స్థానంలో ఉంచింది.
ఐశ్వర్య రాయ్
1994లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఇండియా నుంచి మిస్ వరల్డ్‌గా ఎందరు గెలిచినా.. ప్రపంచ సుందరిగా ఈమె ఎక్కువ ప్రఖ్యాతను గడించింది. తర్వాత హిందీ, తమిళ సినిమాల్లో నటించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
డయానా హెడెన్
ఇండియాకు మూడోసారి మిస్ వరల్డ్ టైటిల్ తెచ్చింది డయానా హెడెన్. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ లండన్‌లో డిగ్రీని అందుకుంది. అనంతరం మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించి.. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.
యాక్తా ముఖి
ముంబైకు చెందిన యుక్తా ముఖి మిస్ వరల్డ్‌గా టైటిల్‌ను గెలుచుకున్న నాల్గొవ ఇండియన్‌గా పేరు సంపాదించుకుంది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో చదివి.. టైటిల్ విన్ అయ్యాక విద్యా, మహిళ హక్కుల కోసం లా చేసింది.
ప్రియాంక చోప్రా
ఐశ్వర్య రాయ్ తర్వాత మిస్ వరల్డ్ పేరుల్లో ఎక్కువమందికి తెలిసిన పేరు ప్రియాంక చోప్రా. ఈ భామ 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ భామ టైటిల్ విన్నింగ్ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి.. హాలీవుడ్ స్థాయికి చేరుకుంది.
మానుషి చిల్లర్
2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ భామ ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మానుషి చిల్లర్ తర్వాత ఇప్పటివరకు ఏ ఇండియన్ అమ్మాయి మిస్ వరల్డ్ కాలేకపోయింది. మిస్ వరల్డ్ 2024లో ఇండియాను రిప్రజెంట్ చేస్తూ వెళ్లిన సినీ శెట్టి.. అతి కొద్ది స్థానాల్లో విజయానికి దూరమైపోయింది.
Also Read : మిస్ వరల్డ్ విన్నర్‌కు ఎన్నో ఉచితమైన సేవలు.. కిరీటం ధర లక్ష డాలర్లుకు పైమాటే కానీ