Miss World 2024 Prize Money : మిస్ వరల్డ్ విన్నర్‌కు ఎన్నో ఉచితమైన సేవలు.. కిరీటం ధర లక్ష డాలర్లుకు పైమాటే కానీ
Miss World 2024 Crown Prize : మిస్ వరల్డ్ విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అందుకుంది. మరి గెలిచిన విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు? ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా?
Miss World 2024 Prize Money Details : మిస్ వరల్డ్ 2024 పోటీలు ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. 28 ఏళ్ల తర్వాత ఇండియా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. 71వ మిస్ వరల్డ్ విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova) టైటిల్‌ను, కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ మిస్ ఇండియా పోటీల్లో టైటిల్ విన్నర్(Miss World 2024 Winner)కు ఎంత ప్రైజ్‌మనీ ఉంటుంది? కిరీటం ధర ఎంత ఉంటుంది? ఈ ప్రైజ్‌మనీ ఇవ్వడం వెనుక ఏమైనా సీక్రెట్ కాలిక్యూలేషన్స్ ఉంటాయా? వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిష్టాత్మకమైన పోటీలు
మిస్ వరల్డ్ వేడుకలను 1951 నుంచి నిర్వహిస్తున్నారు. అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీలను ఎరిక్ మోర్లే స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా అందం, వైవిధ్యం, సాంస్కృతిక మార్పిడిని జరుపుకోవడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. దీనిలో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన మోడల్స్ టైటిల్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీల్లో గెలిచిన వారు కిరీటం కైవసం చేసుకుంటారు. ఈ ఏడాది ముంబై వేదికగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. ఈసారి క్రిస్టినా పిస్కోవా టైటిల్‌ను, కిరీటాన్ని సొంతం చేసుకుంది. అయితే వీటితో పాటు ప్రైజ్‌మనీ కూడా ఉంటుందా?
ఆ సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ అవుతారు..
ప్రపంచ సుందరిగా విజేత అయిన వారికి ప్రైజ్‌మనీ(Miss World 2024 Prize Money) ఎంత ఉంటుందనే విషయానికొస్తే.. ఎన్నో బెనిఫిట్స్ గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ సుందరి విజేత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టుల వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు అంబాసిడర్ అవుతారు. సులువుగా చెప్పాలంటే వివిధ ఛారిటబుల్ ట్రస్ట్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాలతో పాటు.. విద్యాపరమైన, సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేయడంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ పాల్గొంటుంది.
ఏడాదిపాటు అవి పూర్తిగా ఉచితం
మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ తన ప్రయాణంలో ఆమె దేశంలో శాంతి, సామరస్యాన్ని ప్రచారం చేయడంతో పాటు.. మొత్తం సమాజ అభివృద్ధికి కృష్టి చేయాలి. అయితే కిరీటం కైవసం చేసుకున్న వారికి హోటల్ వసతి, ఆహారంతో సహా మానవతా సమస్యలపై తన స్వరం వినిపించడానికి ప్రపంచాన్ని ఉచితంగా పర్యటించే అవకాశాన్ని పొందుతుంది. విజేతలు మిస్ వరల్డ్ సంస్థకు అంబాసిడర్‌గా ఉండే అవకాశాన్ని పొందుతారు. బ్యూటీ, మేకప్ ప్రొడెక్ట్స్‌ను సంవత్సరకాలంలో ఉచితంగా పొందుతారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ డిజైనర్లు, ఫోటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్ట్‌ల సేవలు కూడా ఉచితంగానే ఆస్వాదిస్తారు. అనేక ఇతర ప్రోత్సహకాలు కూడా ఉంటాయి.
కిరీటం విలువ
మిస్ వరల్డ్ కిరీటం విలువ సుమారు $100,000 ఉంటుందని అంచనా. కిరీటం మధ్యలో నీలిరంగు భూగోళం ఉంటుంది. దాని చుట్టూ ఖండాలను సూచించే ఆరు తెల్లని గోల్డ్ షేప్స్ ఉంటాయి. వాటిని ముత్యాలు, వజ్రాలతో రూపొందించారు. దీనిని విజేత తలకు సరిపోయేట్లు అడ్జెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ కిరీటం విజేతలకు ఏ మాత్రం సొంతం కాదు. ఆమె దానిని ఏడాది తర్వాత మరో బ్యూటీకి అందిచాల్సి ఉంటుంది. అయితే ఈ కిరీటానికి ప్రతిరూపాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అందిస్తుంది. ఇది ఆమె గుర్తుగా ఉంచుకోవచ్చు.
Also Read : మిస్ వరల్డ్-2024గా క్రిస్టినా పిస్కోవా - టాప్-8తో సరిపెట్టుకున్న కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి