Miss World 2024 Winner: మిస్ వరల్డ్-2024గా క్రిస్టినా పిస్కోవా - టాప్-8తో సరిపెట్టుకున్న కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి
Miss World 2024: ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీలు తాజాగా ముగిశాయి. 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి కిరీటం కైవసం చేసుకుంది.
Krystyna Pyszkova Won Miss Worls 2024: ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీలు తాజాగా ముగిశాయి. ఈ ఏడాది జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. లెబనాన్‌కు చెందిన అజైటౌన్ రన్నరప్‌గా నిలిచింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక అవ్వడం విశేషం. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు జరిగిన ఈ మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మొత్తం ప్రపంచంలోని 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా వారందరి వెనక్కి నెట్టి క్రిస్టినా పిస్కోవా కీరిటం దక్కించుకుని విశ్వ సుందరిగా నిలిచింది.
ఈ సారి భారత్ నుంచి పోటీలో ఉన్న సిని శెట్టి 8 వ స్థానంలో నిలిచి ఆ తర్వాత నాలుగోవ స్థానానికి జరిగిన కాంపిటిషన్ నుంచి వెనుదిరిగింది. దీంతో టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబోలు (బోట్స్వానా) నిలిచారు. ఎంతో ఆసక్తిగా సాగినా ఈ ఫినాలేలో చివరి పోటీలో క్రిస్టినా, అజైటౌన్ నిలవగా.. వీరిద్దరిలో క్రిస్టినానే కీరిటం వరించింది. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినిశెట్టి టాప్-8తోనే సరిపెట్టుకుని ఈ పోటీ నుంచి నిష్క్రమించింది.
కాగా ఈసారి ప్రపంచ సుందరి కీరిటం కోసం 130కి పైగా దేశాల అందాల భామలు పోటీ పడ్డారు. భారత్ నుంచి కీరిటం కోసం పోటీ దిగిన ఈ కన్నడ బ్యూటీ ఒక్క అడుగు దూరంలో కీరిటాన్ని చేజార్చుకుంది. కాగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఫైనల్స్ నేడు శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభయం అయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ ఈవెంట్‌లో 112 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిని కరణ్ జోహార్, మిస్ వరల్డ్ 2013 పోటీ విజేత మేగాన్ యంగ్ హోస్ట్ చేయగా.. 12 మంది జ్యూరి సభ్యులుగా వ్యవహరించారు. వారు మిస్ వరల్డ్ 2017 విజేత మానుషీ చిల్లర్, నటీనటులు కృతి సనన్, పూజా హెగ్డే; జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్; సినీ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, వార్తా వ్యక్తి రజత్ శర్మ అధ్యక్షత వహించారు.
కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన సినీ శెట్టి పుట్టి పెరగిందట ముంబైలోనే. సినీ శెట్టి మంచి డ్యాన్సర్. 14 ఏండ్ల వయసులోనే భరత నాట్యం నేర్చుకుంది. ఆమె ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు రాధాకృష్ణన్ పద్మిని దగ్గర భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పదుల సంఖ్యలో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.సిని శెట్టి విద్యాభ్యాసం పూర్తిగా ముంబైలోనే కొనసాగింది. సెయింట్ డొమినిక్ సావియో యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. ప్రస్తుతం, ఆమె చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్(CFA) కోర్సు చదువుతోంది.సినీ శెట్టి 2022లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నది. కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహించి మిస్ ఇండియా కర్ణాటక టైటిల్ ను గెలుచుకున్న ఆమె అదే జోష్ లో ఇప్పుడు మిస్ వరల్డ్ 2023 పోటీల్లో పాల్గొంది.