TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP Desam
తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అనౌన్స్ చేసి ఏడాది పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడులో విజయ్ మాట్లాడారు. ప్రధానంగా హిందీని తమిళనాడు పై రుద్దటానికి ప్రయత్నిస్తున్నారన్న విజయ్..దానిపై పోరాడకుండా సోషల్ మీడియాలో కొట్లాడుతున్న బీజేపీ, డీఎంకే పార్టీలపై మాటల దాడి చేశారు విజయ్. విజయ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే "
నిధుల కేటాయింపు కేంద్రం చేయాల్సిన పని. రావాల్సిన నిధులను అడగటం రాష్ట్రాల హక్కు. కానీ ఈ డీఎంకే, బీజేపీ వాళ్లు ఇద్దరూ అదే మన భాషలో చెప్పాలంటే మన ఫాసిజం, మన పాయాసం( యాంటీ ఫాసిజం) వీళ్లిద్దరూ మన రాజకీయ, సైద్ధాంతిక శత్రువులు..వీళ్లిద్దరూ ఏం చేస్తున్నారంటే మంచిగా ఓ ఒప్పందం చేసుకుని సోషల్ మీడియాలో మార్చి మార్చి హ్యాష్ ట్యాగ్స్ తో ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు తమిళనాడును.? వాళ్లిద్దరూ ఎలా అంటే వీళ్లు భలే గొడవపడుతున్నార్రా అని మనం అనుకోవాలి అలా నటిస్తారు. ప్రజలంతా నమ్మేయాలి దాన్ని. వాట్ బ్రో..ఇట్స్ రాంగ్ బ్రో.
ఈలోపు మన కుర్రోళ్లు..స్లీపర్ సెల్స్ లా ఎక్కడుంటారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వాళ్ల ట్విట్టర్ వార్ లోకి వెళ్లి టీవీకే ఫర్ టీఎన్ అని ఓ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసేసి వస్తారు. నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలందరికీ ఎవరెవరు దేని కోసం ఏం చేస్తారో..ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారో ప్రజలకు ఓ ఐడియా ఉంది. అసలు భాషలతో సంబంధం లేకుండా విద్యార్థులు ఏ భాషలో చదువుకోవాలో ఛాయిస్ పిల్లలకు, పిల్లల తల్లితండ్రులకు ఉండాలి. భాషను ఎవరిమీదా ఎప్పుడూ రుద్దకూడదు. విద్యా బోధనలో, పిల్లలు నేర్చుకోవటంలో, ప్రశ్నలు అడగటంతో ఏ అంశంలోనైనా భాష ఏంటనేది ఎవరూ ఎవ్వరి మీదా రుద్దకూడదు కదా బ్రో.
మీరేం అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. మనం కలుస్తూనే ఉంటాం. ఈ సమస్యను ఎదిరిద్దాం..కలిసి పోరాడదాం. రాబోయేది మన కాలమే. వెట్రిదే విజయం.





















