ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క కుదిర్చారు!

నా ప్రియుడు నాతో మాట్లాడటం లేదంటూ.. పోలీసులను ఆశ్రయించిన ప్రియురాలికి పోలీసులు ఊహించని షాకిచ్చారు.

FOLLOW US: 

ప్రేమికుల మధ్య గొడవలు సహజమే. ఒకరిపై ఒకరి కోపంతో మాట్లాడుకోవడం కూడా మానేస్తారు. ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడితేనే.. మళ్లీ ఒక్కటవ్వుతారు. సాధారణంగా ప్రియుడు లేదా ప్రియురాలు మాట్లాడుకోకపోతే.. వారి స్నేహితులో, బంధువులో హెల్ప్ చేస్తారు లేదా హెల్ప్ తీసుకుంటారు. కానీ, ఈ యువతి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. ప్రియుడు తనతో మాట్లాడటం లేదు.. సాయం చేయండని అడిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

చింద్వారా ప్రాంతానికి చెందిన యువతి.. సరనీ ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ఇటీవల ఆమె తన ప్రియుడి పుట్టిన రోజున విష్ చేయడం మరిచిపోయింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఏదో పనిలోపడి మరిచిపోయానని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆమె చెప్పింది. కానీ, అతడు మాత్రం ఆమె మాట వినలేదు. అన్ని ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో.. ఇక పోలీసులే దిక్కు అని అనుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. 

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్.. ఆమె స్పందన ఇదీ!

పోలీసులకు ఫోన్ చేసిన ఆమె.. ‘‘నా ప్రియుడు కొద్ది రోజులుగా నాతో మాట్లాడటం లేదు. పుట్టిన రోజున విష్ చేయడం మరిచిపోయానని అలిగాడు. మీరే నాకు సాయం చేయాలి’’ అని అడిగింది. దీంతో పోలీసులు ఆమె రిక్వెస్టును కాదనలేక.. ఆ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌కు రప్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరిగా.. ఇలా ప్రేమికులుగా పోట్లాడుకోకుండా.. పెళ్లి చేసుకుని కలిసి జీవించండి అని వారికి హితవు చెప్పారు. అంతేకాదు.. వీరి ప్రేమను వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు కూడా అంగీకరించడంతో.. ఆలస్యం చేయకుండా ఆర్య సమాజ్ మందిరంలో ఇద్దరికీ పెళ్లి చేసేశారు. చూశారా.. ఈ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో!

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 21 Nov 2021 09:40 AM (IST) Tags: Madhya Pradesh Girlfriend Calls Police MP Woman Calls Police Woman Calls Police మధ్యప్రదేశ్

సంబంధిత కథనాలు

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

టాప్ స్టోరీస్

Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Tax on Petrol, Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Tax on Petrol, Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Farmer ABV : చెప్పినట్లే వ్యవసాయం - సీరియస్‌గా తీసుకున్న సీనియర్ ఐపీఎస్ !

Farmer ABV  : చెప్పినట్లే వ్యవసాయం  -  సీరియస్‌గా తీసుకున్న సీనియర్ ఐపీఎస్ !

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!