Pir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam
భారతదేశంలో అతిపొడవైన రైల్వే టన్నెల్ కశ్మీర్ లోని బనిహాల్ దగ్గర ఉంది. భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ టన్నెల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.ఈ టన్నెల్ పేరు పీర్ పంజల్ రైల్వే టన్నెల్, దీని పొడవు సుమారు 11.2 కిలోమీటర్లు. ఇది కొండల మధ్య రైలు ప్రయాణానికి మార్గం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని నిర్మించడం మాత్రం అంత తేలిక కాదు. -7 డిగ్రీల చలిలో, తీవ్రమైన హిమపాతం మధ్య ఇంజనీర్లు, కార్మికులు ఎంతగానో కష్టపడ్డారు. కానీ ఆ కష్టానికీ ఫలితం అద్భుతంగా వచ్చింది. ఈ టన్నెల్ రవాణాను సులభం చేస్తూ, దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను దగ్గర చేసింది. ఈ టన్నెల్ గుండా రైల్లో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అది కొండల మధ్య ఓ అద్భుత ప్రయాణం లాంటి అనుభవం. ఇంత నైపుణ్యంతో నిర్మించిన టన్నెల్ భారతీయ రైల్వే ప్రతిభకు చక్కని నిదర్శనం ఉదాహరణ లా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతోంది.