Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP Desam
స్పేస్ సైన్స్ హిస్టరీలో ఓ అద్భుతం జరిగింది. నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లినా కూడా సేఫ్ గా బతకగలిగింది. అసలేంటీ పార్కర్ ప్రోబ్ అంటే సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. మనం భూమి మీద 50 డిగ్రీలు ఎండ ఉంటేనే మాడిపోతాం అలాంటిది సూర్యుడిపై ఫోటో స్పియర్ లోనే 5వేల 500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి కోర్ లో దాదాపుగా 15మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ పై మాటే. మరి ఇంత వేడి సూర్యుడి నుంచి ఎలా పుడుతోంది తెలుసుకోవాలి కదా. అందుకే సైంటిస్టులు 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ అని ఈ చిన్న టెలిమెట్రీ ఉపగ్రహాన్ని పంపించారు. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే 1800 డిగ్రీల టెంపరేచర్ వరకూ ఇది తట్టుకోగలదు. అందుకే సూర్యుడికి వీలైనంత దగ్గరగా అంటే సూర్యూడి నుంచి సుమారు 38లక్షల మైళ్ల దూరానికి దీని తీసుకెళ్లి వదిలిపెట్టారు. అంతే ఈ పరికరం సిగ్నల్ రావటం ఆగిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందేమో దీని సీన్ అనుకున్నారు నాసా సైంటిస్టులు. కానీ డిసెంబర్ 24న ఆగిపోయిన దీని సిగ్నల్ మళ్లీ రెండు రోజుల తర్వాత అంటే 26 అర్థరాత్రి వచ్చింది. అంటే పార్కర్ ప్రోబ్ అంత దగ్గరగా వెళ్లినా కూడా సేఫ్ గా ఉందన్నమాట. ఈ పరికరం సేకరించిన డేటా అంతా అక్కడ నుంచి ట్రాన్ ఫర్ అవ్వటం మొదలైంది. జనవరి 1 నాటికి ఈ డేటా భూమికి చేరుకోవచ్చు. సో సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన పార్కర్ ప్రోబ్ ఏం తెలుసుకుందో అతి త్వరలోనే నాసా సైంటిస్టులు రివీల్ చేయనున్నారన్న మాట.