Living Together: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
ఈ రోజుల్లో సహజీవనం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇండియాలోని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో దీన్ని అమలు చేస్తున్నారు. అయితే, కాస్త భిన్నంగా.. అదెలాగో చూడండి.
పెళ్లికి ముందే శృంగారం అనగానే మనం ముక్కున వేలు వేసుకుంటాం. అయితే, కొన్ని పాశ్చాత్య దేశాల్లో అది చాలా సాధారణం. మన దేశంలో ఓ చోట అది తప్పు కాదు. పైగా తరతరాలుగా వస్తున్న గొప్ప ఆచారం. పైగా తమ పిల్లలు లైంగికంగా ఒక్కటయ్యేందుకు తల్లిదండ్రులే ప్రత్యేకంగా వారికి గుడిసెలు ఏర్పాటు చేస్తారు. సుమారు వారం రోజులు అమ్మాయి, అబ్బాయిలను ఏకాంతంగా గడిపేందుకు ప్రోత్సాహిస్తారు. మరి పెళ్లి? అనేగా మీ సందేహం? దీని గురించి తెలుసుకోవాలంటే.. ఇప్పటికీ ఈ సాంప్రదాన్ని పాటిస్తున్న ఆ ప్రాంతం గురించి ముందుగా తెలుసుకోవల్సిందే.
ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నది మరెక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రాచీన ఆదివాసీ తెగలు ఉనికిలో ఉన్నాయి. వీరిలో మురియా తెగకు ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. బస్తర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఉత్తర దిక్కున ఈ తెగ ప్రజలు నివసిస్తున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల బయట వ్యక్తులు ఎవరూ ఇక్కడ అడుగు పెట్టేందుకు సాహసించరు. ఇక్కడి ప్రజలు కూరగాయలు, వరి, బఠాణీలను సాగు చేస్తారు. వాటినే ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నారు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఈ తెగలో పెద్దలు తమ పిల్లలకు పెళ్లిల్లు కుదర్చరు. తమకు నచ్చిన భాగస్వామిని పెళ్లి చేసుకొనే స్వేచ్ఛను పిల్లలకే వదిలేస్తారు. అంతేకాదు.. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనేందుకు కూడా అనుమతి ఇస్తారు. ఈ సాంప్రదాయాన్ని ‘గోటుల్’ అంటారు. పెళ్లికి ముందు యువతీ యువకులు తమ భాగస్వామి లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు నచ్చినవారితో ఏకాంతంగా గడపడం గోటుల్ విధానం.
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
ఒక గుడిసెలో ఒక జంట మాత్రమే ఉండాలి. ఆ గుడిసెలో వారు కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. చివరికి లైంగికంగా కలవచ్చు. వారం రోజులపాటు వారిని ఎవరూ డిస్ట్రబ్ చేయరు. అమ్మాయిలను ఈ గుడిసెల్లోకి పంపే ముందు ప్రత్యేక వేడుక నిర్వహిస్తారు. దాదాపు స్వయంవరం తరహాలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో అబ్బాయి.. తనకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకుని సెక్స్‌లో పాల్గొనవచ్చు. అబ్బాయికి అమ్మాయి నచ్చినట్లయితే.. ఆమె తలలో పువ్వు పెట్టాలి. ఆ అబ్బాయి నచ్చితేనే అమ్మాయి తన తలలో పువ్వు పెట్టేందుకు అనుమతించాలి. ఒక వేళ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడకపోతే.. వారు మరొకరిని ఎంపిక చేసుకుని మరో వారం రోజులు గడపవచ్చు.
Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?
ఈ సాంప్రదాయంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. పిల్లలకు పదేళ్ల వయస్సు రాగానే గోటుల్‌కు పంపిస్తారట. ఇందుకు అంగీకరించకపోతే బహిష్కరిస్తారు. అయితే, ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచాన్ని చూస్తున్న.. ఆ సమాజంలో క్రమేనా మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి యువత చదువుపై ఆసక్తి చూపుతున్నట్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిన పలువురు సామాజిక ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే, ఈ సాంప్రదాయం వల్ల ఆ ప్రాంతంలో సెక్స్ నేరాలు అస్సలు లేవట. అయితే, కంబోడియాలో కూడా ఇలాంటి సాంప్రదాయమే ఉంది. అక్కడ ఏకంగా అమ్మాయిలను గుడిసెల్లోకి పంపి ఏడు రోజులుపాటు నచ్చని అబ్బాయితో ఏకాంతంగా గడిపేందుకు ప్రోత్సహిస్తారు.
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!