Bacteria in Beard: షాకింగ్, మగాళ్ల గడ్డం.. కుక్కబొచ్చు కంటే హానికరమట, ఇది చాలా టూ మచ్ కదూ!
గడ్డం పెంచుతున్నారా? అయితే, మీ గడ్డంలో కుక్క బొచ్చులు పెరిగే బ్యాక్టీరియా కంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా నివసిస్తోందట. తాజా పరిశోధనలో ఏం తేలిందో చూడండి.
కుక్కలను పెంచేవారికి హానికరమైన బ్యాక్టీరియాతో ముప్పు తప్పదని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఈ ముప్పు కేవలం కుక్కలను పెంచేవారికే కాదు.. గడ్డం పెంచేవారిలో కూడా ఎక్కువట. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో.. పురుషుల గడ్డంలో పెరుగుతున్న బ్యాక్టీరియా.. కుక్క బొచ్చులో ఉండే బ్యాక్టీరియా కంటే ప్రమాదకరమట. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు.
గతేడాది పశు వైద్య పరీక్షల కోసం ఉపయోగించే MRI స్కానర్ ద్వారా కుక్కల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మనుషులకు ప్రమాదం ఉందా, లేదా తెలుసుకోవడానికి పలు పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా కుక్కల బొచ్చులో పెరిగే బ్యాక్టీరియాను పరిశీలించారు. అలాగే.. మనుషుల గడ్డాల్లో పెరిగే బ్యాక్టీరియాను కూడా పరిశీలించారు. చిత్రం ఏమిటంటే.. కుక్కల బొచ్చులో కంటే.. మనుషుల గడ్డంలో పెరుగుతున్న బ్యాక్టీరియానే అత్యధిక ప్రమాదకరమైనదని తేలింది.
పరిశోధనలో భాగంగా 18 మంది పురుషుల గడ్డాన్ని సేకరించి పరిశీలించారు. అదే సమయంలో 30 కుక్కలకు మెడ వద్ద ఉండే బొచ్చును తీసుకుని పరిశీలించారు. స్విట్జర్లాండ్‌లోని హిర్స్‌ల్యాండెన్ క్లినిక్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ గుట్జిట్ తన పరిశోధన గురించి మాట్లాడుతూ.. ‘‘కుక్కల బొచ్చుతో పోలిస్తే.. పురుషుల గడ్డం నుంచి తీసుకున్న నమూనాలలో ఎక్కువ బ్యాక్టీరియాను కనుగొన్నారు’’ అని తెలిపారు. 18 నుంచి 76 ఏళ్ల వయస్సు గల పురుషుల్లో అత్యధిక సూక్ష్మజీవులు ఉన్నాయన్నారు. 30 కుక్కల్లో 23 కుక్కలు మాత్రమే అధిక బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయని, పురుషుల గడ్డంతో పోల్చితే వాటి సాంద్రత తక్కువేనని పేర్కొన్నారు.
Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?
పురుషులలో ఏడుగురు మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైన దోషాలు ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ గుట్జీట్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫలితాలను బట్టి.. గడ్డంతో ఉన్న మనుషుల కంటే కుక్కలను శుభ్రంగా పరిగణించవచ్చు’’ అని అన్నారు. అయితే, ‘ది బార్డ్ లిబరేషన్ ఫ్రంట్’ వ్యవస్థాపకుడు కీత్ ఫ్లెట్ ఈ పరిశోధనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం పెంచేవారికి వ్యతిరేకంగా ఈ పరిశోధన ఉందని, గడ్డం పెంచేవారిలో భయాందోళనలు (పోగోనోఫోబియా) సృష్టిస్తున్నారని తెలిపారు. గడ్డం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గడ్డం పెంచడం ఆరోగ్యకరమైన వైద్యులు సైతం నొక్కి చెబుతుంటే.. ఈ స్టడీ వాస్తవాలను వక్రీకరిస్తోందని మండిపడుతున్నారు.
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి