X

Tightrope Village: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం

ఆ ఊరిలో ప్రజలు తాడు మీద నడుస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తాడు మీద నడిచేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే..

FOLLOW US: 

మీరు తాడు మీద నడవగలరా? చాలా కష్టం కదూ. అయితే, ఆ గ్రామంలో ప్రజలంతా తాడు మీదే నడుస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ.. రోడ్డు మీద నడిచినంత ఈజీగా తాడు మీద నడిచేస్తారు. ఇదేం చిత్రం? ఆ ఊరిలో రోడ్లు లేవా? సదుపాయాల్లేవా అనేగా మీ సందేహం. అదేమీ కాదు. అది ఆ గ్రామస్తుల టాలెంట్. టాలెంట్ ఒకరికే సొంతం కాదనే విషయాన్ని ఆ ఊరి ప్రజలకు బాగా తెలుసు. అందుకే, ఆ ఊరిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తాడు (టైట్ రోప్) మీద నడవడాన్ని అలవాటు చేసుకున్నారు.

రష్యాలోని డాగేస్టాన్ అటానమస్ రిపబ్లిక్ పర్వతాల్లోని త్సోవ్క్రా -1 గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు వందేళ్ల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు టైట్ రోప్(తాడు) మీద నడవటం నేర్చుకున్నారు. మహిళలతో సహా ప్రతి ఒక్కరూ ఇక్కడ తాడు మీద నడుస్తారు. ఈ ప్రతిభ వల్ల చాలామందికి సర్కస్‌లో అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ఊరిలో ప్రజలంతా దీనిపై శిక్షణ పొందారు. 

1980 నుంచి ఇక్కడి ప్రజలు తాడు మీద నడవడంలో శిక్షణ పొందారు. అప్పట్లో సర్కస్‌లో పాల్గొనేందుకు ఈ శిక్షణ పొందేవారు. అది క్రమేనా సాంప్రదాయంగా మారడంతో.. పుట్టిన ప్రతి ఒక్కరికీ తాడుపై నడవడంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో ఈ గ్రామంలో సుమారు 3 వేల మంది నివసించేవారు. రష్యాలోని పలు ప్రాంతాల్లో సర్కస్ సంస్థల్లో అవకాశాలు లభించడం వల్ల ఊరు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ గ్రామంలో కేవలం 400 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరందరీకి టైట్ రోప్ మీద నడిచే అనుభవం ఉంది. 

Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?

పర్వతాల్లో తిరిగేందుకు వీలుగా..: త్సోవ్క్రా -1 గ్రామం పర్వతాల మధ్యలో ఉంటుంది. ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకు వెళ్లేందుకు పూర్వికులు తాళ్లను ఆధారంగా చేసుకొనేవారు. కొండకు కొండకు మధ్య తాడును కట్టి.. దానిపై నడుస్తూ మరోవైపుకు చేరుకొనేవారు. దీంతో ఆ ఊరిలో ప్రజలంతా తాడుపై నడవడాన్ని అలవాటు చేసుకున్నారు. ఆ ప్రతిభ వల్ల సర్కస్‌లో అవకాశాలు లభించడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే, తాడు మీద నడిచే ఈ సాంప్రదాయం కోసం ఒక్కోక్కరూ ఒక్కో కథ చెబుతారు. వంతెనలు కూలిపోతే.. నదులను దాటేందుకు ఈ ప్రతిభ ఉపయోగపడుతుందని అంటారు. కొందరు వ్యవసాయ క్షేత్రాలపై తాడు కట్టుకుని నడుస్తుంటారు. పర్వత ప్రాంతం కావడం వల్ల అక్కడ వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. దీంతో కుటుంబాలను పోషించేందుకు ఆ గ్రామంలోని పురుషులు నగరాల్లోకి వెళ్లి టైట్ రోప్ ప్రదర్శనలిస్తూ.. ఉపాధి పొందుతున్నారు. వచ్చేప్పుడు కుటుంబం కోసం ఆహార ధాన్యాలు తీసుకొస్తారు. అయితే, ఇప్పటి తరానికి టైట్ రోప్ మీద ఆసక్తి తగ్గిపోయింది. ఇందులో శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో భవిష్యత్తులో ఈ గ్రామ సాంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Tightrope village Tightrope Walking on tightrope Russia Village Tsovkra-1 టైట్ రోప్

సంబంధిత కథనాలు

Divorce: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...

Divorce: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Don't Marry: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది

Don't Marry: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది

New Study: ఈ ఆహారాలు గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచేస్తాయి... జాగ్రత్త

New Study: ఈ ఆహారాలు గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచేస్తాయి... జాగ్రత్త

Sugar Alternative: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్

Sugar Alternative: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్

టాప్ స్టోరీస్

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram :  పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?