Cool Drink Death: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
కూల్ డ్రింక్ తాగాడు.. కొన్ని గంటల తర్వాత హాస్పిటల్‌కు పరుగులు పెట్టాడు. వైద్యులు 18 గంటలు శ్రమించినా అతడిని రక్షించలేకపోయారు. ఇంతకీ అతడికి ఏమైంది?
![Cool Drink Death: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు! Chinese Man Drinks 1.5 Liter Bottle Of Soft Drink In 10 Minutes, Dies Of Gas Buildup In His Body Cool Drink Death: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/26/de66cbcf2ecfad9ff925d2a876cd39bd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కూల్ డ్రింక్ అంటే దాదాపు అందరికీ ఇష్టమే. ఈ రోజుల్లో మంచి నీళ్లు తాగినా.. తాగకపోయినా కూల్ డ్రింక్ మాత్రం పీపాల కొద్దీ తాగేస్తున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలు పరిశోధనలు కూల్ డ్రింక్స్‌లో పెస్టిసైడ్స్ (పురుగుల మందులు) ఉన్నట్లు తేల్చి చెప్పాయి. అయితే, వాటి మోతాదు తక్కువే. కానీ, అతిగా కూల్ డ్రింక్స్ తాగేవారికి మాత్రం అది స్లో పాయిజన్ కిందే లెక్క. అంటే.. నెమ్మదిగా అవయవాలను దెబ్బ తీసి చంపేస్తుందన్నమాట. అయితే, ఓ వ్యక్తి కూల్ డ్రింక్ తాగిన ఆరు గంటల్లోనే మరణించాడు. ఇంతకీ ఏమైంది? అతడి మరణానికి కారణం ఏమిటీ?
కూల్ డ్రింక్ ఎంత ఇష్టమైనా.. తాగడానికి మాత్రం ఒక పద్ధతి ఉంటుంది. అదే పనిగా.. ఆత్రుతగా తాగేస్తే ఎంత ప్రమాదమనేది ఈ వ్యక్తి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. చైనాకు చెందిన ఓ వ్యక్తి 1.5 లీటర్ల కోకా-కోలా డ్రింక్ 10 నిమిషాల్లోనే తాగేశాడు. బాటిల్ దించకుండా తాగి తన స్నేహితుల ముందు హీరో అవుదామని అనుకున్నాడు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత బాగానే ఉన్నాడు. కానీ, ఆరు గంటల తర్వాత అతడి శరీరం అదుపు తప్పింది.
అతడి ఒక్కసారిగా ఉబ్బిపోయింది. తీవ్రమైన నొప్పితో అతడు బీజింగ్‌లోని చోయాంగ్ హాస్పిటల్‌కు పరుగులు పెట్టాడు. వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా.. కడుపు నిండా గ్యాస్ నిండిపోయినట్లు గుర్తించారు. అతడికి ‘న్యుమాటోసిస్’ ఏర్పడిందని వైద్యులు తెలిపారు. పేగు, కాలేయానికి చెందిన సిరలో గ్యాస్ నిండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని ‘క్లీనిక్స్ అండ్ రీసెర్చ్ ఇన్ హేపటాలజీ అండ్ గ్యాస్ట్రోయెంటరాలజీ’ పేర్కొంది.
Also Read: ఎడమవైపు తిరిగి ఎందుకు పడుకోవాలి? అసలు ఎటు తిరిగి పడుకుంటే మంచిది?
ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కాలేయానికి ఆక్సిజన్ నిలిచిపోతుంది. దీన్నే ‘షాక్ లివర్’ అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితి వల్ల వైద్యులు కూడా అతడిని రక్షించలేకపోయారు. కాలేయం, ఇతర అవయవాల్లోకి గ్యాస్ చేరడం వల్ల అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే వైద్యులు.. అతడి శరీరంలోని గ్యాస్‌ను వెలికి తీసేందుకు ప్రయత్నించారు. కాలేయం దెబ్బతినకుండా కొన్ని మందులు కూడా ఇచ్చారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. వైద్యులు సుమారు 18 గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది. చూశారుగా ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే.. ఇంకెప్పుడు కూల్ డ్రింక్‌ను ఒకేసారి తాగేందుకు ప్రయత్నించకండి. కొంచెం కొంచెం తాగితేనే శరీరం మంచిగా స్వీకరిస్తుంది. లేకపోతే.. మరణానికి దారి తీస్తుంది.
Also Read: శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగుతున్నారా? ఎలా తెలుసుకోవాలి? సంకేతాలు ఏమిటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)