News
News
X

Water: శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగుతున్నారా? ఎలా తెలుసుకోవాలి? సంకేతాలు ఏమిటి?

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం, వ్యాయామం, తగిన నిద్ర పోవడమే కాదు... తగినన్ని మంచి నీళ్లు తాగాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.

FOLLOW US: 
Share:

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం, వ్యాయామం, తగిన నిద్ర పోవడమే కాదు... తగినన్ని మంచి నీళ్లు తాగాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. తగినన్ని నీళ్లు తాగకపోతే మన శరీరం మనకు పలు సూచనలు, సంకేతాలు కూడా ఇస్తుంది. వీటిని గమనిస్తూ నీళ్లు తాగాలి. నీళ్లని తగిన మోతాదులో తాగకపోతే మన శరీరం చూపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?

* తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్  బారిన పడతాం. దీంతో మూత్రం ముదురు పసుపు లేదా గోధుమ రంగుల్లో వస్తుంది. ఇలా వస్తుందంటే శరీరానికి నీరు అవసరమని. వెంటనే తగినన్నినీటిని తాగాలి. 

* శరీరంలో ద్రవాలు సరిగ్గా లేకపోతే నోరు తడి ఆరిపోతుంది. దీంతో నోట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా నోరు దుర్వాసన వస్తుంది. ఇలా జరుగుతుందంటే నీళ్లు తాగాల్సి ఉంటుంది. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందుతాం. 

* నీళ్లను తక్కువగా తాగితే శరీరంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుంది. దీంతో శరీర భాగాలు, కణాలకు రక్తం సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. దీంతో తల తిరగడం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా అనిపిస్తే వెంటనే నీటిని తాగండి. 

Also Read: ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారా? వారి కోసం ఇవిగో పరిష్కార మార్గాలు

* తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరంలో ద్రవాలు సరిగ్గా ఉండవు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అప్పుడు శరీరం అత్యవసర స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు ఆకలి బాగా అవుతుంది. ఆకలి బాగా అవుతుంది అంటే రెండు కారణాలు. ఒకటి తగ్గినన్ని నీళ్లని తాగకపోవడం. రెండోది షుగర్ ఉండటం. షుగర్ లేకపోతే వారు కచ్ఛితంగా మొదటిదే కారణమని భావించాలి. అంటే... వెంటనే నీళ్లని తాగాలి. 

* అతిగా నీరు తాగితే మేలు కంటే కీడే ఎక్కువ. ఎక్కువగా నీరు తాగడం వల్ల మెదడుపై ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలి. 

Also Read: సంతాన లోపం సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను రోజూ తాగండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Sep 2021 05:18 PM (IST) Tags: Health Tips Drinking Water Water

సంబంధిత కథనాలు

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు

గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు

సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?

సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?

సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి

సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి

టాప్ స్టోరీస్

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

Sundar Pichai Salary: గూగుల్‌లో మరో హిట్‌ వికెట్‌, సుందర్‌ పిచాయ్‌ జీతంలో భారీ కోత!

Sundar Pichai Salary: గూగుల్‌లో మరో హిట్‌ వికెట్‌, సుందర్‌ పిచాయ్‌ జీతంలో భారీ కోత!

Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు

Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు

Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే "ఉక్కు ప్రజా గర్జన "

Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే