అన్వేషించండి

Summer Tips: వేసవిలో డిన్నర్ తర్వాత ఈ పనులు అస్సలు చేయొద్దు! లేకుంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సి రావచ్చు! 

Summer Tips: వేసవిలో రాత్రి భోజనం తర్వాత మీరు చేసే ఆరు తప్పులు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. సరైన జీర్ణక్రియ, నిద్రను డిస్టర్బ్ చేస్తాయి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భోజనం తర్వాత వెంటనే పడుకోవడం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఊబకాయం తెస్తుంది.
  • చల్లని నీరు, ఐస్ క్రీం జీర్ణక్రియకు ఆటంకం, జలుబు కలిగిస్తుంది.
  • తీవ్ర వ్యాయామాలు, తలస్నానం రాత్రి భోజనం తర్వాత ప్రమాదకరం.
  • స్క్రీన్ చూడటం, స్వీట్స్ తినడం నిద్ర, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Summer Tips: వేసవిలో అలసిపోయిన తర్వాత రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవాలనే ఆలోచన వస్తుంది. ఈ క్రమంలో చేసే చిన్న చిన్న తప్పులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అంతేకాకుండా ఆసుపత్రిలో చేరేందుకు కారణమవుతాయి. ముఖ్యంగా వేసవిలో మన జీవక్రియ, జీర్ణవ్యవస్థ మరింత సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచింది. 

భోజనం చేసిన వెంటనే పడుకోవడం 

చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకోవడం అలవాటు. అయితే, ఈ అలవాటు వేసవిలో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది యాసిడ్స్‌ను, గ్యాస్  ఊబకాయానికి దారితీస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు మేల్కొని ఉండటం ముఖ్యం.

చల్లటి నీరు లేదా ఐస్ క్రీం తాగడం 

వేసవిలో భోజనం తర్వాత చల్లటి నీరు తాగాలని లేదా ఐస్ క్రీం తినాలనిపిస్తుంది, కానీ ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. జలుబు ,దగ్గుకు కారణమవుతుంది. రాత్రి భోజనం తర్వాత వెంటనే చల్లని ఆహారాలను తీసుకోవద్దు.

తీవ్రమైన వ్యాయామాలు చేయడం 

కొంతమంది భోజనం తర్వాత వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారని అనుకుంటారు, కానీ ఇది ప్రమాదకరం. వేసవిలో, రాత్రి భోజనం తర్వాత తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల వాంతులు లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి.  

రాత్రి భోజనం చేసిన వెంటనే తలస్నానం చేయడం 

రాత్రి భోజనం చేసిన వెంటనే తలస్నానం చేయడం లేదా జుట్టును కడుక్కోవడం ప్రమాదకరం. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. తలనొప్పి, నీరసంగా అనిపిస్తుంది. తలతిరగడం వంటి సమస్యలు కూడా రావచ్చు.  

మొబైల్ ఫోన్లు లేదా టీవీ చూడటం 

రాత్రి భోజనం తర్వాత నిరంతరం స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా వేసవిలో శరీరం సహజంగానే త్వరగా అలసిపోతుంది. ఇది తల బరువుగా ఉండటానికి, మరుసటి రోజు నిద్రమత్తుగా అనిపిస్తుంది.  

స్వీట్స్‌ ఎక్కువగా తినడం 

వేసవిలో చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల త్వరగా గ్యాస్ లేదా అసిడిటీ వస్తుంది. స్వీట్లు లేదా తీపి పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర కూడా పెరుగుతుంది. భోజనం తర్వాత ఎక్కువ చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మానుకోండి.

Frequently Asked Questions

వేసవిలో రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మంచిదేనా?

లేదు, వేసవిలో రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, గ్యాస్ మరియు ఊబకాయానికి దారితీస్తుంది. కనీసం 30 నిమిషాలు మేల్కొని ఉండటం మంచిది.

రాత్రి భోజనం తర్వాత చల్లటి నీరు లేదా ఐస్ క్రీం తీసుకోవచ్చా?

రాత్రి భోజనం తర్వాత వెంటనే చల్లటి నీరు లేదా ఐస్ క్రీం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది జలుబు, దగ్గుకు కారణమవుతుంది కాబట్టి తీసుకోవడం మంచిది కాదు.

రాత్రి భోజనం తర్వాత చేసే తీవ్రమైన వ్యాయామాలు సురక్షితమేనా?

లేదు, రాత్రి భోజనం తర్వాత తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల వాంతులు లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ సమయంలో తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

రాత్రి భోజనం చేసిన వెంటనే తలస్నానం చేయడం వలన కలిగే ఇబ్బందులేమిటి?

రాత్రి భోజనం తర్వాత వెంటనే తలస్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది, తలనొప్పి, నీరసం, తల తిరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

రాత్రి భోజనం తర్వాత స్క్రీన్ టైమ్ (మొబైల్, టీవీ) ఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టమేమిటి?

రాత్రి భోజనం తర్వాత నిరంతరం స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది తల బరువుగా ఉండటానికి, మరుసటి రోజు నిద్రమత్తుగా అనిపించడానికి కారణమవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget