FertilityProblems: సంతాన లోపం సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను రోజూ తాగండి
దానిమ్మ పండ్లలో K, C, B, ఐరన్, పొటాషియం, జింక్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. అందుకే దానిమ్మ పండును తింటే మనకు ఎంతో ప్రయోజనం.
దానిమ్మ పండ్లలో K, C, B, ఐరన్, పొటాషియం, జింక్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. అందుకే దానిమ్మ పండును తింటే మనకు ఎంతో ప్రయోజనం. దానిమ్మ పండ్లను నేరుగా తినలేని వారు జ్యూస్ చేసి రోజూ తాగొచ్చు. బ్రేక్ ఫాస్ట్ చేశాక ఒక గంట తర్వాత బ్రేక్ ఇచ్చి జ్యూస్ తాగాలి.
Also Read: HeadBath: రోజూ తలస్నానం చేయవచ్చా? చేస్తే ఏమౌతుంది?
* దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. హార్మోన్ల సమస్యలు తొలగిపోతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. సంతానం లేక సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు క్రమం తప్పకుండా రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
Also Read: Banana: రాత్రి పూట అరటి పండు తింటున్నారా? అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
* దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మహిళల్లో రుతుక్రమం సరిగ్గా ఉంటుంది.
* దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం నుంచి ఉపశమనం పొందొచ్చు.
* దానిమ్మ జ్యూస్ లో బ్రెస్ట్, ప్రొస్టేట్, స్కిన్ మరియు లంగ్ క్యాన్సర్ ను నివారించే యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది.
* దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ యవ్వనంగా కనబడేలా చేస్తుంది. యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్‌ను పుష్కలంగా అందించే ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి.
Also Read: Pregnant Women: ప్రెగ్నెంట్స్ ఈ ఆసనాలు చేస్తే చాలా మంచిదట... 90 నిమిషాల యోగా ఆరోగ్యవంతం
* దానిమ్మలోని విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. దగ్గు, జలుబు వంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తిని పుష్కలంగా అందిస్తుంది.
* దానిమ్మ తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది మరియు రీజనరేట్ అవుతుంది . అందుకే చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు దానిమ్మను అధికంగా తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.