HeadBath: రోజూ తలస్నానం చేయవచ్చా? చేస్తే ఏమౌతుంది?
రోజూ తలస్నానం చేయడం మంచిదేనా? అసలు రోజూ తలస్నానం చేయవచ్చా? చేస్తే ఏం జరుగుతుంది? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
రోజూ రెండు సార్లు మామూలు స్నానం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే, రోజూ తలస్నానం చేయడం మంచిదేనా? అసలు రోజూ తలస్నానం చేయవచ్చా? చేస్తే ఏం జరుగుతుంది? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం.
Also Read: Banana: రాత్రి పూట అరటి పండు తింటున్నారా? అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
రోజూ రెండు సార్లు స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే దుమ్ము, ధూళి పోతుంది. అంతేకాదు గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ప్రతి రోజూ స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి.
మరి, తలస్నానం చేయాలా వద్దా అనేది జుట్టు కండీషన్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. దుమ్ము, ధూళిలో తిరిగే వారు అయితే తప్పనిసరిగా ప్రతి రోజూ తలస్నానం చేస్తేనే మంచిది. రోజూ తలస్నానం చేయడం వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది.
Also Read: TOMATO FACE PACKS: టమాటా ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? జిడ్డు చర్మం, మొటిమలకు ఇది సరైన ఔషధం
అదేంటంటే... జట్టు కదుళ్ల నుంచి సహజ సిద్ధమైన నూనెలు స్రవిస్తాయి. దీంతో శిరోజాలు సహజంగా మెత్తగా, స్మూత్‌గా ఉంటాయి. రోజూ తలస్నానం చేయడం వలల్ల ఈ నూనెలు స్రవించే శాతం తగ్గిపోతుంది. దీంతో జట్టు పొడిబారుతుంది. దుమ్ములో తిరగని వాళ్లైతే రోజూ తలస్నానానికి దూరంగా ఉండటమే మంచిది.
* ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభం అవుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తలస్నానం చేయకపోవడమే ఉత్తమం.
* ఒకవేళ ప్రతి రోజూ తలస్నానం చేయక తప్పదు అనుకునే వాళ్లు... గాఢత తక్కువగా ఉన్న షాంపూలే వాడండి.
* జట్టుకు రంగు వేసుకునే వాళ్లు దీర్ఘకాలం ఉండాలంటే రోజూ తలస్నానం చేయకూడదు.
* తలస్నానం తర్వాత జుట్టును ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రయ్యర్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి.
* రోజూ తలస్నానం చేసేందుకు ఉప్పునీరు వాడుతున్నా కూడా జుట్టు రాలే సమస్య రావొచ్చు. కాబట్టి డాక్టర్‌ను కలిసి అనువైన షాంపూ ఎంపిక చేసుకోండి.
* మగవారు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి.
* తల జిడ్డుగా తయారవుతుందని చాలామంది నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందడం చాలా ముఖ్యం. కాబట్టి తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మసాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* షాంపూలు, కండీషనర్లను ఏవి పడితే అవి వాడకూడదు. తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువ రసాయనాలు ఉండే షాంపులు, కండీషనర్లను వినియోగించవద్దు.
* ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూలను వాడాలి. వెంట్రుకలు డ్రైగా ఉంటే మాయిశ్చరైజింగ్ షాంపూలతో తలస్నానం చేయడం మంచిది.