TOMATO FACE PACKS: టమాటా ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? జిడ్డు చర్మం, మొటిమలకు ఇది సరైన ఔషధం
ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా తమ చర్మం జిడ్డు(oily)గా ఉంటుందని కొంతమంది బాధపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలు (tips) పాటిస్తే ముఖం కాంతివంతగా మారుతుంది.
ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా తమ చర్మం జిడ్డు(oily)గా ఉంటుందని కొంతమంది బాధపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలు (tips) పాటిస్తే ముఖం కాంతివంతగా మారుతుంది. జిడ్డు గల చర్మం(skin) ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ చేయాల్సిందే. అందంగా కనిపించాలని ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు. అందులో ఒకటే టమాటా (tomato).దీన్ని ఉపయోగించి ఎలా అందంగా మారొచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read: Sun Screen: సన్‌స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలి? ప్రయోజనాలేంటి?
* టమాటా(tomato) లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. చర్మం రంగు (skin color)ని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు (pimples) నుంచి ఉపశమనం పొందుతాం. ఇందుకోసం కొన్ని ప్యాక్స్ వాడొచ్చు. ముందుగా రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి. ఇందులో కాస్తా తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.
* కొద్దిగా శనగ పిండిని తీసుకుని అందులో టమాటా గుజ్జుని కలపాలి. ఈ మెత్త టి పేస్ట్‌ని ముఖానికి పూతలా వేయాలి. ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్‌లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది.
* ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కాస్తా ముల్తానీ మట్టి తీసుకోండి. అందులో టమాట జ్యూస్ (tomato juice) వేసి బాగా కలపండి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖంపై వేసుకోండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
* ఎండకు కమిలిన చర్మాన్ని (skin) తిరిగి అందంగా మార్చడంలో టమాటా (tomato) బాగా పనిచేస్తుంది. కొద్దిగా టమాట రసం తీసుకుని అందులో కాస్తా మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కాస్తా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రాయడం వల్ల ట్యాన్ (tan) సమస్య తగ్గుతుంది.
* టమాట గుజ్జులో ఏం కలపకుండా అది మాత్రమే ముఖం, మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా మంచి ఫలితముంటుంది. ఇది నేచురల్ రెమిడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా... మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.
Also Read: Shocking Video: ఛీ... ఈ ఫ్యాక్టరీలో రస్కులు ఎలా ప్యాక్ చేస్తున్నారో... చూడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.