BlackHeads: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?
ముక్కు మీద బ్లాక్ హెడ్స్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం.
ముక్కు మీద బ్లాక్ హెడ్స్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. చర్మంపై ఉండే రంధ్రాల్లో దుమ్మ, నూనె, డెడ్ సెల్స్ పేరుకుపోయి బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి కారణమవుతాయి. తొలగించే కొద్దీ ఇవి వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం.
* కోడిగుడ్లను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం గుడ్డులోని తెల్ల సొన బాగా ఉపయోగపడుతుంది. ఒక గుడ్డులోని తెల్లసొనకి రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడాని కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖంపై రాసి ఐదు నిమిషాలు మర్దనా చేసి 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
* గ్రీన్ టీతోనూ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించొచ్చు. కొద్దిగా నీటిని తీసుకుని బాగా మరిగించి అందులో కొంచెం గ్రీన్ టీ పౌడర్ వేయాలి. 2 నిమిషాలు ఆగాక.. దాన్ని వడకట్టి అందులో కాటన్ ముంచి బ్లాక్ హెడ్స్ మీద మర్దన చేయాలి. పొడిగా అయ్యాక చల్లని నీటితో ముఖం కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
* రెండు టీస్పూన్ల ఓట్ మీల్‌కి ఒక గుడ్డులోని తెల్ల సొనని వేసి బాగా కలపాలి. దీన్ని ముఖంపై రాసి పావు గంట అయ్యాక కడిగేయాలి. ఈ చిట్కా కూడా వారానికి మూడు సార్లు చేస్తే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: నాకు స్కూల్‌కి వెళ్లాలని ఉంది... అఫ్గాన్ అమ్మాయి ఆవేదన... నెట్టింట్లో వీడియో వైరల్
* టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో కాటన్ బాల్స్‌ను ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయాలి. కాసేపు సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖం కడిగేయాలి.
* ఒక టీ స్పూన్ తేనె, గుడ్డులోని తెల సొనని మిశ్రమంగా చేసి ముఖంపై ఫేస్ మాస్క్‌లా రాయాలి. 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా ప్రతి రోజూ చేయాలి.
* ప్రతి వారం సీసాల్ట్‌తో కూడిన స్ర్కబ్‌తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* అర టీ స్పూన్ చక్కెరకి గుడ్డులోని తెల్ల సొన కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖంపై అప్లై చేయలి. 10 నిమిషాలు అయ్యాక కడగాలి. ఈ పద్దతిని తరచూ చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
* బాదంపొడి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్ సబ్బు కూడా బ్లాక్ హెడ్స్ నివారణకు బాగా పని చేస్తాయి.