By: ABP Desam | Updated at : 25 Sep 2021 03:28 PM (IST)
కచోరీ అమ్ముతున్న 14 ఏళ్ల కుర్రాడు (Phot Credit/viral_foodie431 Instagram)
సాధారణంగా 14 ఏళ్ల అబ్బాయి అంటే ఏం చేస్తుంటాడు? పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇప్పుడు అంటే ఆన్ లైన్ క్లాసులు కాబట్టి... వీలైనంత ఎక్కు వ సమయాన్ని కంప్యూటర్ల ముందు గడుపుతుంటారు. లేదంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ, అహ్మదాబాద్‌కు చెందిన ఓ 14ఏళ్ల కుర్రాడు మాత్రం దహీ కచోరీ తయారు చేసి అమ్ముకుంటున్నాడు. ఈ కుర్రాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అసలు కథేంటంటే... అహ్మదాబాద్‌కు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడు మణినగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా తినుబండారాల బండి నడిపిస్తున్నాడు. ఫుడ్ ప్రేమికుల ఆర్డర్ మేరకు గ్రీన్, రెడ్ చట్నీలు, పెరుగు, కారపూస వేసి వారికి అందిస్తున్నాడు. ఈ దహీ కచోరీ విలువ రూ.10 మాత్రమే. ఈ పిల్లాడు ఆర్డర్ మేరకు దహీ కచోరీ ఎలా తయారు చేసిన వీడియోని ఫుడ్ బ్లాగర్ దొయాష్ పతర్బే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.
అతడు షేర్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. తన తల్లిదండ్రులకు సాయం చేయడానికి ఇలా తండ్రి నడిపే బండి వద్దకు వచ్చాడట. ‘అతడో పోరాటయోధుడు. భవిష్యత్తులో ఎంతో విజయవంతం అవుతాడు. కానీ, రూ.10కే కచోరీ అమ్మడం తక్కవగా అనుకుంటున్నా. ఇలాగే అమ్మితే వారికి ఏం లాభాలు వస్తాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ కుర్రాడి వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వండి... ఆర్థికంగా సాయం చేస్తాం అని మరికొందరు అడుగుతున్నారు.
రెండు రోజుల్లోనే ఈ కుర్రాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో... ఈ వీడియో చూసిన స్థానికులు ఆ బండి వద్దకే వెళ్లి కచోరీ తింటున్నారు. 10 రూపాయలకే ఇంత టేస్టీ కచోరీ గతంలో ఎప్పుడూ తినలేదని వారు కామెంట్లు పెడుతున్నారు. దీంతో అతడి బండి వద్ద కచోరీ అమ్మకాలు రెట్టింపయ్యాయి.
Veg Box: వీళ్లలా చేయగలమా? దాచుకున్న సొమ్ముతో పొలాలు కొని, 600 పేద కుటుంబాల కడుపు నింపుతున్న స్నేహితులు
Women Marriage Age: పాతికేళ్లు వచ్చినా అమ్మాయిలకు పెళ్లి ముచ్చట రావడం లేదా? పెరిగిపోయిన అమ్మాయిల వివాహ వయసు
సీతమ్మవారి పెండ్లికి వెండి పీతాంబరం పంపిన సిరిసిల్ల నేతన్న
అమెరికాలో లక్షల జీతం కాదనుకుని ఇండియాలో 20 ఆవులతో ఫాం పెట్టి కోట్లు గడించాడు
చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ రేపర్ల నుంచి సన్ గ్లాసెస్ తయారుచేసే స్టార్టప్
Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
/body>