భారత మార్కెట్‌లోకి రెండు సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లు విడుదల అయ్యాయి. దిగ్గజ టెక్ కంపెనీ డెల్ వీటిని లాంచ్ చేసింది. డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్, డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6 పేరున్న ఈ ల్యాప్‌టాప్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి.
డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్.. ఏఎండీ రైజన్ ఆర్7-5800 హెచ్ సిరీస్ మొబైల్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6 ల్యాప్‌టాప్.. ఇంటెల్ కోర్ ఐ7-11800 హెచ్ టైగర్ లేక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్ ప్రారంభ ధరను రూ.1,34,990గా.. డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6 రైజన్ ఎడిషన్ ప్రారంభ ధరను రూ.1,59,990గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లను డెల్ అధికారిక వెబ్ సైట్ (Dell.com) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్5 రైజన్ ఎడిషన్.. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేతో రానుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,920x1,080 పిక్సెల్‌గా, రిఫ్రెష్ రేట్ 165 Hzగా ఉన్నాయి. వీటి బ్యాటరీ కెపాసిటీ 86 డబ్ల్యూహెచ్ఆర్ గా ఉంది. ఇందులో ఏలియన్‌వేర్ హెచ్‌డీ 720 పిక్సెల్ వెబ్ కామ్‌తో పాటు డ్యూయల్ ఎరే మైక్రో ఫోన్స్ ఉంటాయి. ఇందులో కిల్లర్ వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, యూఎస్‌బీ టైప్ ఏ పోర్ట్స్, యూఎస్‌బీ టైప్ సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లేదా మిక్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
డెల్ ఏలియన్‌వేర్ ఎం 15 ఆర్6.. 15.6 అంగుళాల క్యూహెచ్‌డీ + డిస్‌ప్లేతో రానుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2,560x1,440 పిక్సెల్‌గా, రిఫ్రెష్ రేట్ 240 Hzగా ఉన్నాయి.
ఇందులో యూఎస్‌బీ టైప్ ఏ పోర్ట్స్, థండర్ బోల్ట్ 4 పోర్టు, హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. వీటి బ్యాటరీ కెపాసిటీ 86 డబ్ల్యూహెచ్ఆర్ గా ఉంది. 240 వాట్స్ అడాప్టర్ కూడా ఉంటుంది.
Neha Kakkar Photos: వైట్ డ్రెస్‌లో మల్లెపువ్వులా సింగర్ నేహా కక్కర్
In Pics: సరికొత్త లుక్ తో 'హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్'.. ఇది చాలా స్పెషల్ గురూ!
Realme Dizo Watch 2: రియల్మీ సబ్ బ్రాండ్ డిజో నుంచి వాచ్ 2.. ఈ నెల 15న లాంచ్.. రూ.3 వేల రేంజ్లో ధర
WhatsApp: వాట్సాప్‌లో కొంతమందికి మాత్రమే మన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ కనిపించేలా ఫీచర్ !
Realme Android 11: రియల్మీ 6, 6ఐ, 6ఎక్స్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు