Dhurandhar 2 First Review : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
Dhurandhar 2 Review : బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ 'ధురంధర్ 2'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

Actress Yami Gautam First Review Of Durandhar 2 Movie : బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సీక్వెల్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ బిగ్ హైప్ క్రియేట్ చేస్తుండగా... మార్చి 19న వరల్డ్ వైడ్‌గా 'ధురంధర్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సీక్వెల్ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ 'ధురంధర్ 2' ఎలా ఉంటుందో వివరించారు.
మూవీ ఎలా ఉంటుందంటే?
తాజాగా ఓ సమ్మిట్‌లో పాల్గొన్న యామీ గౌతమ్... తాను ఇప్పటికే 'ధురంధర్ 2' మూవీ చూసినట్లు చెప్పారు. 'నా భర్త అద్భుతమైన సినిమాలు చేస్తారు. నేను ఇప్పటికే ధురంధర్ 2 చూశాను. ఇది చాలా అసాధారణమైనది. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.
ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్‌తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం.' అంటూ చెప్పారు. ఈ క్రమంలో 'ధురంధర్ 2'పై హైప్ పదింతలు అవుతోంది.
Also Read : ఓటీటీలోకి మూకీ మూవీ 'గాంధీ టాక్స్' - ఆ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్... స్మాల్ ట్విస్ట్ ఏంటంటే?
40 పేజీల స్క్రిప్ట్
'ఆర్టికల్ 370' మూవీ షూటింగ్ టైంలో తాను 'ధురంధర్' మూవీ స్క్రిప్ట్ చదివినట్లు చెప్పారు యామీ గౌతమ్. 'ధురంధర్ స్క్రిప్ట్ కేవలం 40 పేజీలు మాత్రమే. అయితే, అది చదివిన వెంటనే నా కళ్లు చెమర్చాయి. ఆ తర్వాత ఆదిత్యతో ఏమీ చెప్పలేకపోయా. ఆ క్షణం నుంచి ఇది ప్రతీ భారతీయుడు గర్వపడే సినిమా అవుతుందని నాకు తెలుసు. ఆదిత్య నిజాయతీ, నమ్మకంతో ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.' అంటూ చెప్పారు.
ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, నవీన్ కౌశిక్, డానిష్ పండోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. 'ధురంధర్' ప్రస్తుతం 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
























