Chin Hairs: ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారా? వారి కోసం ఇవిగో పరిష్కార మార్గాలు
కొందరు మహిళలకి ముఖంపై కూడా వెంట్రుకలు వస్తుంటాయి. దీంతో వారు చాలా అసౌకర్యానికి గురవుతారు. నలుగురిలో కలిసేందుకు సిగ్గుపడుతుంటారు.
మన శరీరంలో అనేక భాగాల్లో వెంట్రుకలు పెరుగుతుంటాయి. అయితే కొందరు మహిళలకి ముఖంపై కూడా వెంట్రుకలు వస్తుంటాయి. దీంతో వారు చాలా అసౌకర్యానికి గురవుతారు. నలుగురిలో కలిసేందుకు సిగ్గుపడుతుంటారు. బయటికి వెళ్లాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు తెలుసుకోబోయే చిట్కాలతో ముఖంపై అవాంఛిత రోమాల సమస్య నుంచి బయటపడండి.
Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?
* ఒక టేబుల్ స్పూన్ చక్కెర, టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని 50ML వాటర్‌తో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత చల్లార్చి ముఖంపై వెంట్రుకలు ఉన్న చోట రాయాలి. 30నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పోతాయి. ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.
* రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్‌కి బాగా పండిన అరటి పండుతో కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి ద్వారా కూడా అవాంఛిత రోమాలు రాలిపోతాయి.
* టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ నిమ్మరసం, 5 టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్ తీసుకుని బాగా కలపాలి. కొన్ని పెసలు నానబెట్టి పేస్టులా చేసి దీన్ని కూడా ముందుగా సిద్ధం చేసుకున్న జ్యూస్‌కి కలపాలి. దీన్ని ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
* ముఖంపై ఉన్న అవాంచిత రోమాలను లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా తొలగించుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్‌స్పూన్ బియ్యప్పిండి.. ఈ మూడింటినీ ప్యాక్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు తొలగించుకున్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా, మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల అవాంఛిత రోమాలు త్వరగా రాకుండా ఉంటాయి.
Also Read: మీ చంకల్లో దురదగా ఉందా? ఇవే కారణాలు కావొచ్చు... మరి పరిష్కారాలు ఏంటి?
* శనగపిండి, పసుపు, నిమ్మరసం, మీగడను పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో.. గుండ్రంగా రుద్దుతూ క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.
* గుడ్డులోని తెల్లసొన, పంచదార, కార్న్ ఫ్లోర్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై హెయిర్ గ్రోత్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. అది ఆరిన తర్వాత తడి చేతులతో.. రబ్ చేయాలి. ఇది చర్మంపై చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి.. చర్మంపై అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.