X

ArmPits: మీ చంకల్లో దురదగా ఉందా? ఇవే కారణాలు కావొచ్చు... మరి పరిష్కారాలు ఏంటి?

చంకల్లో దురదతో బాధపడుతూ ఉంటారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటి? ఈ సమస్యకు పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

FOLLOW US: 

చర్మంపై చాలా మందికి అనేక చోట్ల దురదలు వస్తుంటాయి. కొందరికి కొన్ని భాగాల్లో దద్దుర్లు వచ్చి చర్మం ఎర్రగా మారుతుంది. ఇదిలా ఉంటే మరికొందరు ఎప్పుడూ చంకల్లో దురదతో బాధపడుతూ ఉంటారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటి? ఈ సమస్యకు పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

Also Read: Banana: రాత్రి పూట అరటి పండు తింటున్నారా? అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చంకల్లో దురద వస్తుంది. అతిగా గోకితే అక్కడ దద్దుర్లు ఏర్పడుతాయి. చంకల్లో చర్మం రాపిడికి గురవుతుంది. దీంతో దురద మరింత ఎక్కవవుతుంది. మరి కొంతమందిలో చర్మ వ్యాధులు, గజ్జి, తామర వల్ల కూడా చంకల్లో దురద పుడుతుంది. కొందరికి పొడి చర్మం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలా చంకల్లో దురద పెట్టేందుకు అనేక రీజన్స్ ఉన్నాయి. 

Also Read: HeadBath: రోజూ తలస్నానం చేయవచ్చా? చేస్తే ఏమౌతుంది?

చంకల్లో దురదతో బాధపడేవారు వెల్లుల్లి, ఉల్లిపాయ, గోంగూర, వంకాయ, చేపలు, కోడిగుడ్లు, చికెన్ లాంటి ఆహారాలను కొన్ని రోజులు మానేయాలి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే... రోజూ రెండు సార్లు స్నానం చేయాలి. మార్కెట్లో దొరికే యాంటీ కాఫింగ్ పౌడర్లను రోజూ వారితే సమస్య తగ్గుతుంది. వైద్యుల సలహా మేరకు మెడికేటెడ్ సబ్బులు వాడాలి. వేరే వారికి చెందిన టవల్స్, దువ్వెన, దుస్తులు వాడకూడదు. 

కొన్ని వేపాకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసి ఆ మిశ్రమాన్ని చంకల్లో రాసి కొంత సమయం అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదలు తగ్గుతాయి. చంకలకు గాలి తగిలేలా వదులైన దుస్తులు ధరించాలి. 

టీ ట్రీ ఆయిల్టీ-ట్రీ ఆయిల్ చంక దురద మరియు ఇన్ఫెక్షన్లకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. యాంటీ-సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా, ఇది చంకలలో దురదకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

* ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ టీ-ట్రీ ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నీటితో కలపండి.

* అలాగే 5-6 చుక్కల టీ-ట్రీ ఆయిల్‌ను ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చంకలను చల్లటి నీటితో కడగండి. 

Also Read: FertilityProblems: సంతాన లోపం సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను రోజూ తాగండి

నిమ్మరసం: 

నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం దురద సమస్యను త్వరగా తొలగిస్తుంది. 

* నిమ్మకాయ ముక్కను చంకలో 5 నిమిషాల పాటు రుద్దండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి. లేదంటే నిమ్మరసాన్ని నీళ్లల్లో కలిపి చంకల్లో రాయండి. ఓ పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేయండి. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: LifeStyle Health Health Tips Armpits Rashes

సంబంధిత కథనాలు

Maharashtra Omicron Outbreak: బీఅలర్ట్.. మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్ కేసులు.. 12కు చేరిన సంఖ్య

Maharashtra Omicron Outbreak: బీఅలర్ట్.. మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్ కేసులు.. 12కు చేరిన సంఖ్య

Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!

Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!

Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం

Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం

Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'

Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'

Omicron Cases in India: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు

Omicron Cases in India: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు

టాప్ స్టోరీస్

Honor 60 Pro: హానర్ 60 ప్రో వచ్చేసింది.. రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు.. 108 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా.. ధర ఎంతంటే?

Honor 60 Pro: హానర్ 60 ప్రో వచ్చేసింది.. రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు.. 108 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా.. ధర ఎంతంటే?

Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియాంక.. మానస్ ని హగ్ చేసుకొని, సారీ చెప్పి..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియాంక.. మానస్ ని హగ్ చేసుకొని, సారీ చెప్పి..