Sleeping On Left: ఎడమవైపు తిరిగి ఎందుకు పడుకోవాలి? అసలు ఎటు తిరిగి పడుకుంటే మంచిది?
వివిధ భంగిమల్లో పడుకోవడం మంచిది కాదు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎంతో మంచి చెబుతున్నారు వైద్యులు.
చాలా మంది పడుకునే సమయంలో భిన్న భంగిమల్లో నిద్రిస్తుంటారు. కానీ, అలా వివిధ భంగిమల్లో పడుకోవడం మంచిది కాదు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎంతో మంచి చెబుతున్నారు వైద్యులు. అలాగే శాస్త్రియంగా కూడా ఎడమ వైపునకు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
Also Read: శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగుతున్నారా? ఎలా తెలుసుకోవాలి? సంకేతాలు ఏమిటి?
* మన శరీరంలో లింఫాటిక్ వ్యవస్థ ఎంతో కీలకమైనది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఈ వ్యవస్థలోని ముఖ్యమైన భాగమైన తోరాకిక్ డక్ట్ ఎడమవైపు ఉంటుంది. కనుక ఎడమవైపునకు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. లింఫ్ వ్యవస్థ కొవ్వులు, ప్రొటీన్లు, ఇతర ముఖ్యమైన పదార్ధాలను కణజాలాలకు చేరవేస్తుంది. అందుకే ఎడమ వైపునకు తిరిగి పడుకోవాలి.
* లింఫ్ వ్యవస్థలో స్ల్పీన్ పెద్ద అవయవం. ఇది కూడా శరీరంలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అందుకే లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఈ అవయవం మరింత చురుకుగా పని చేస్తుంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది.
Also Read: ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారా? వారి కోసం ఇవిగో పరిష్కార మార్గాలు
* గుండెల్లో మంటగా ఉన్న వారు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే... ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
* మన శరీరంలో లివర్ కుడి వైపు ఉంటుంది. రైట్ సైట్ తిరిగి పడుకుంటే లివర్ పై భారం పడుతుంది. దీంతో లివర్‌లో వ్యర్థాలు పేరుకుపోతాయి. అందుకే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల లివర్ పై ఒత్తిడి ఉండదు. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యర్థాలను లివర్ సులభంగా బయటకు పంపుతుంది.
Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?
* గుండెకు ఎడమ భాగం ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరించి దాన్ని శరీరానికి పంపుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే రక్త సరఫరా సులభంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: సంతాన లోపం సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను రోజూ తాగండి
Also Read: రోజూ తలస్నానం చేయవచ్చా? చేస్తే ఏమౌతుంది?