Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Maruti Brezza vs Nissan Magnite: భారతదేశంలో మారుతి బ్రెజ్జా బాగా నచ్చింది, నిస్సాన్ మాగ్నైట్ కూడా మంచిది. మీ కోసం ఏ SUV మంచిదో చూడండి.

Maruti Brezza or Nissan Magnite Which SUV is better | భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ SUV విభాగం వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎస్‌యూవీ విభాగంలో కస్టమర్‌లు మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన మైలేజ్, కుటుంబసభ్యులకు తగినంత స్థలాన్ని పొందుతారు. Maruti Brezza, Nissan Magnite ఈ విభాగంలో బాగా చర్చకు వచ్చే రెండు SUVలు. అయితే ఈ రెండింటి ధర, ఇంజిన్ కెపాసిటీ, ఫీచర్‌లు వివిధ రకాల కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని అందిస్తున్నాయి. అయితే మీ కోసం ఏ SUV సరైనదో పూర్తి వివరాలతో తెలుసుకుందాం.
ఇంజిన్, మైలేజ్‌లో Brezza మరింత పవర్‌ఫుల్
Maruti Brezza 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 103 PS శక్తిని, మంచి టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ నగరంతో పాటు హైవే జర్నీ రెండింటిలోనూ సాఫీగా నడుస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్‌లలో, ఈ SUV దాదాపు 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ విభాగంలో మారుతి బ్రెజ్జా మంచిదని కస్టమర్లు భావిస్తున్నారు.
అదే సమయంలో, Nissan Magnite 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది సాధారణ, టర్బో రెండు ఎంపికలలో అందుబాటులోకి వస్తుంది. టర్బో ఇంజిన్ ఎక్కువ శక్తిని అందిస్తుంది. సిటీలో నడపడానికి ఈ ఎస్‌యూవీ బాగానే ఉంటుంది, అయితే Brezzaతో పోలిస్తే దీని ఇంజిన్ కొంచెం తక్కువ శక్తివంతంగా ఉంటుంది. అయితే, ట్రాన్స్‌మిషన్ ఎక్కువ ఎంపికలు Magniteని కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.
ఫీచర్లలో రెండింటికీ వేర్వేరు శైలి
Maruti Brezza ఫీచర్ల పరంగా మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌లు సాధారణంగా ఖరీదైన SUVలలో కనిపిస్తాయి. Nissan Magnite కూడా అనేక మంచి ఫీచర్లు కలిగి ఉంది. క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో Android Auto, ఆపిల్ కార్ ప్లే (Apple CarPlay), యాంబియంట్ లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది. సిస్సాన్ Magnite ఇంటీరియర్ కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది.
ధరలో Nissan Magnite చవకైనది
ధర విషయానికి వస్తే మారుతి బ్రెజ్జాతో పోల్చితే Nissan Magnite చాలా చవకైన SUV. దీని ప్రారంభ ధర Brezza కంటే చాలా తక్కువ. ఇది బడ్జెట్ కస్టమర్‌లకు మంచి ఎంపికగా మారుతుంది. అదే సమయంలో Maruti Brezza కొంచెం ఖరీదైన వాహనం, కానీ బలమైన ఇంజిన్, మెరుగైన మైలేజ్, నమ్మదగిన బ్రాండ్ విలువ దీనిని ఫ్యామిలీ బ్రాండ్ కారుగా మారుస్తున్నాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మీకు నిస్సాన్ Magnite సరైనది, కానీ దీర్ఘకాలిక ఉపయోగం కోసం, కొంచెం ఎక్కువ ధర అయినా మారుతి Brezza మీకు సరైన ఛాయిస్ అని కస్టమర్లు చెబుతున్నారు.






















