Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఇంకా నరమాంస భక్షకులు జీవిస్తున్నారు. తోటి వ్యక్తిని చంపి మరే తినేసే ప్రమాదకర ప్రజలు జీవిస్తు్న్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఉందా?

FOLLOW US: 

సాధారణంగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరుపుతారు. సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు, లేదా దహనం చేస్తారు. అయితే, అక్కడి ప్రజలు మాత్రం అలా చేయరు. ఆ శవాన్ని ముక్కలు చేసి ఆకుల మధ్యలో పెట్టి ఉడికించుకుని మరీ తింటారు. ఇది చదివితేనే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది కదూ. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారట. 

☀ నరమాంస భక్షకులు అనగానే.. అంతా మన దేశంలో నివసించే అఘోరాల వైపే చూస్తారు. కానీ, వారి కంటే ప్రమాదకరమైన మనుషులు ఈ ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నారు. కొన్ని దేశాల్లో తమ శత్రువుల శవాలను ఇంటికి తీసుకెళ్లి విందు చేసుకొనే సాంప్రదాయం కూడా ఉంది. వారి గురించి తెలుసుకొనే ముందు.. బంధువులు, స్నేహితులను ఆహారంగా తీసుకొనే తెగ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 

☀ నరమాంస భక్ష్యాన్ని ‘ఆంత్రోపోఫాగి’ అని కూడా అంటారు. మనుషులను తినే మనుషులను కరిబాలెస్ లేదా కానబాలెస్ (Caríbales or Caníbales) అని అంటారు. ఇది నరమాంస భక్షణకు ప్రసిద్ధి చెందిన వెస్టిండీస్ తెగ ‘కరీబ్’ నుంచి ఉద్భవించింది. మానవ చరిత్ర ఆరంభంలో ఇది విస్తృతమైన ఆచారం. అప్పట్లో మనుషులు కూడా జంతువుల తరహాలోనే ప్రవర్తించేవారు. ఆకలి, శరీరక అవసరాల కోసం తోటి మనిషిని చంపి తినేవారు. కాలం మారేకొద్ది మనుషుల్లో కలిగిన మార్పుల వల్ల నరమాంస భక్ష్యాన్ని వికృతమైన చర్యగా పరిగణించడం మొదలైంది. కానీ, ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసీ తెగల్లో ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. 

బంధువులను, మిత్రులను తినేస్తారు..: ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నరమాంసాన్ని తింటారు. దీని కోసం వారు ఇతరులను హత్య చేయరు. కేవలం చనిపోయిన వ్యక్తులను మాత్రమే తింటారు. పశ్చిమ న్యూ గినియాలో ఎన్డీరామ్ కబుర్ నది వెంట కొరోవై అనే తెగ నివసిస్తోంది. ఎవరో మంత్రగాడు వారి సమూహంలోని సభ్యులను చంపేస్తాడని అక్కడి గిరిజనులు నమ్ముతారు. మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తినడం వారి కర్తవ్యం. అంటే.. చనిపోయిన వ్యక్తి ఆత్మను మంత్రగాడికి దక్కకుండా వారిలోనే కలిపేసుకోవడం వారి ఆచారం. సుమారు 10,000 సంవత్సరాల నాటి ఆదిమ ప్రజల తరహాలోనే ఇక్కడి ప్రజలు నివసిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ‘ఎండోకానిబలిజం’ అంటున్నారు. ఈ ప్రక్రియను వారు గౌరవంగా భావిస్తారట. 

ఈ ప్రాంతాల్లో ఎక్కువ: పశ్చిమ మధ్య ఆఫ్రికా, మెలనేసియా(ఫిజి), న్యూ గినియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని మావోరిస్‌లోని కొన్ని ద్వీపాలలో ఇప్పటికీ నరమాంస భక్షణ కొనసాగుతున్నట్లు సమాచారం. పాలినేషియా, సుమత్రా, ఉత్తర-దక్షిణ అమెరికాలోని వివిధ తెగలలో కూడా ఈ సాంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మానవ మాంసాన్ని ఆహారంగా పరిగణిస్తారు. జంతువుల మాంసంతో సమానంగా వాటిని విక్రయిస్తున్నారు. విక్టోరియస్ మావోరీలు యుద్ధంలో చనిపోయిన సైనికుల శరీరాలతో విందు చేసుకుంటారు. సుమత్రాలోని బతక్ డచ్ పాలకుల నియంత్రణలోకి రాక ముందు మార్కెట్లలో మానవ మాంసాన్ని విక్రయించేవారని సమాచారం.

శత్రువులను తినేస్తారు: ఆఫ్రికాలో ఎక్కువగా మంత్ర విద్యలు, చేతబడులు జరుగుతాయి. ఈ సందర్భంగా బలిచ్చే వ్యక్తులను ఆహారంగా తినేయడం అక్కడి సాంప్రదాయం. యుద్ధంలో బంధీలయ్యే సైనికులను ఒకప్పుడు ఆహారంగా తీసుకొనేవారని అక్కడి చరిత్ర చెబుతోంది. ఫిజి ఐలాండ్ కూడా నరమాంస భక్ష్య చరిత్రకు ప్రసిద్ధి చెందింది. అందుకే దీన్ని ‘నరమాంస ద్వీపం’ అని కూడా అంటారు. ఈ ద్వీపంలో నైహేహే గుహల్లో నివసించే ప్రజలు మాత్రమే ఈ పద్ధతులు పాటిస్తున్నట్లు సమాచారం. మిగతా తెగలు దాదాపు అంతరించిపోయాయి. 

☀ ఖైమర్ రూజ్ తిరుగుబాటులో పోరాడుతున్న కంబోడియన్ సైనికులు ఆకలి వేస్తే.. యుద్ధభూమిలో చనిపోయిన  ఖైమర్ రూజ్ సైనికుల ఆహారంగా తినేస్తారట. యుద్ధం ముగిసిన తర్వాత కొంతమంది శత్రువులను ఇంటకి తీసుకెళ్లి మరీ ఆరగిస్తారట. వారి శరీరంలోని గుండె, కాలేయాలను బయటకు తీసేసి వండుకుని తింటారట. 

☀ మన దేశంలోని అఘోరిలు కూడా నరమాంస భక్షక ఆచారాలను పాటిస్తున్నారు. కేవలం సుమారు 25 మంది వరకు మాత్రమే మానవ పుర్రెలను గిన్నెలుగా ఉపయోగిస్తారు. చితిపై కాలిన మానవ అవశేషాలను బూడిదగా శరీరానికి రాసుకుంటారు. వీరు ఎవరినీ హత్య చేయరు. చనిపోయిన వ్యక్తుల శరీరంలోని కొన్ని భాగాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. 

వీరు చాలా డేంజర్: న్యూ గినియాలో నివసించే ‘అస్మత్’ ఆదివాసీ తెగ చాలా డేంజర్. వీరు మనుషులను హత్య చేసి కూడా ఆహారంగా తీసుకుంటారని ఒకప్పుడు అక్కడ పర్యటించిన జర్నలిస్ట్ వెల్లడించాడు. ఆ పర్యటనలో అతడు అక్కడి ప్రజలు ఒక వ్యక్తిని ఏ విధంగా ఆహారంగా తీసుకున్నారనేది ప్రత్యక్షంగా చూశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గిరిజనులు చనిపోయిన వ్యక్తి మెదడును అరచేతితో బయటకు లాగారు. దాన్ని ఆకులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆకును చుట్టి.. నిప్పు మీద దాన్ని కాల్చుకుని తిన్నారు’’ అని తెలిపాడు. 

☀ 1961లో రాజవంశానికి చెందిన నెల్సన్ రాక్‌ఫెల్లర్ ఐదవ కుమారుడు మైఖేల్ రాక్‌ఫెల్లర్‌ను కూడా ఈ తెగ ప్రజలు హత్య చేసి ఆహారంగా తీసుకున్నట్లు సమాచారం. రాక్‌ఫెల్లర్ న్యూ గినియా ప్రాంతంలో ఒక యాత్రలో పాల్గొన్నాడు. ప్రమాదవసాత్తు అతడు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. దీంతో అతడు ఈదుకుంటూ ఈ తెగ నివసిస్తున్న ప్రాంతానికి చేరాడు. దీంతో అస్మత్ తెగ ప్రజలు అతడిని హత్య చేసి తినేసినట్లు సమాచారం.

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

☀ అండమాన్ నికోబార్‌కు సమీపంలో, మన దేశానికి తూర్పు దిక్కులో ఉన్న సెంటినలీస్ ద్వీపంలో కూడా నరమాంస భక్షకులు జీవిస్తున్నారు. అయితే, సాధారణ మానవులు ఎవరూ అక్కడ అడుగుపెట్టలేరు. ఒకవేళ ప్రయత్నించినా వారికి ఆహారం కావడం ఖాయం. వీరికి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. 60 వేల ఏళ్ల నుంచి ఈ తెగ ప్రజలు ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే, 2018లో అక్కడి ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నంలో భాగంగా ద్వీపంలో అడుగుపెట్టిన యుఎస్ మిషనరీ జాన్ అలెన్ చౌను విల్లును బాణాలతో చంపినట్లు సమాచారం. మరి, అతడి శరీరాన్ని ఏం చేశారనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు. 

Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?

Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం

Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Cannibal Tribes Cannibals in World Cannibals in India Cannibals Man eats Man Man Eating tribes Man Eating Humans మనుషులను తినే మనుషులు

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

టాప్ స్టోరీస్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న