Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Balakrishna Role In Daaku Maharaaj: నట సింహం నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి 'డాకు మహారాజ్' సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. ఆ సినిమాలో ఆయన రెండో క్యారెక్టర్ ఏమిటో తెలుసా?
Balakrishna Plays Dual Role in Daaku Maharaaj: 'డాకు మహారాజ్'... మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా. ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఏమిటి? అని అడిగితే చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. అయితే దర్శకుడు బాబి కొల్లి (కెఎస్ రవీంద్ర) ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేయడానికి రెడీ అయ్యారా? అంటే... 'అవును' అనే సమాధానం ఇండస్ట్రీ నుంచి వినపడుతోంది.
'డాకు మహారాజ్' కాకుండా మరో క్యారెక్టర్ అదేనా?
'డాకు మహారాజ్' సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ఆల్రెడీ విడుదల అయింది. నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి సైతం మంచి స్పందన అందుకుంది.
'డాకు మహారాజ్' కాకుండా బాలకృష్ణ ఈ సినిమాలో మరొక క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. అంటే ఆయనది డబుల్ రోల్ అన్నమాట. ఒకటి తండ్రి పాత్ర అయితే... మరొకటి కుమారుడి పాత్ర. తండ్రి డాకు మహారాజ్ (రాబిన్ హుడ్ తరహాలో పేదల కోసం దోపిడీలు చేసే మంచి దొంగ) అయితే... కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అట. అది సంగతి! ఇప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్ గురించి దర్శకుడు బాబి పెద్దగా మాట్లాడటం లేదు. సినిమాలో ఆ క్యారెక్టర్ ట్విస్ట్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తుందట.
ఎవరి ఎవరి జోడిగా ఎవరు నటిస్తున్నారు?
'డాకు మహారాజ్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కాగా... మరొకరు శ్రద్ధా శ్రీనాథ్. తొలుత శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath)ను ఒక పాత్ర కోసం అనుకున్నామని, తర్వాత ఆవిడ మరొక పాత్ర చేశారని దర్శకుడు బాబీ చెప్పారు. రోల్స్ రివర్స్ అయ్యాయని అనుకోవాలి.
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?
'డాకు మహారాజ్' (సీనియర్ బాలకృష్ణ) జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించగా... ఐఏఎస్ ఆఫీసర్ (జూనియర్ బాలకృష్ణ) జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇందులో మరొక బ్యూటిఫుల్ లేడీ ఉన్నారు. ఆవిడ ఊర్వశి రౌతేలా. ఓ స్పెషల్ సాంగ్ చేశారు. థియేటర్లలో ఆ సాంగ్ వచ్చినప్పుడు విజిల్స్ పడటం గ్యారంటీ అని యూనిట్ చెబుతోంది. చాందిని చౌదరి మరొక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
జనవరి 12న 'డాకు మహారాజ్' థియేటర్లలోకి వస్తోంది. మొదట తెలుగులో రిలీజ్ చేసి, వారం తర్వాత వేరే భాషల్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది.