Pushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam
పుష్ప 2 తో అల్లు అర్జున్ విధ్వంసం ఆపట్లేదు. సినిమా విడుదలై 22 రోజులు గడుస్తున్నా బాలీవుడ్ ను అల్లాడించేస్తోంది పుష్ప 2. 22 రోజులు పూర్తయ్యే సరికి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ చేస్తే అక్షరాలా 1719కోట్ల 50లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది బన్నీ సుక్కూ సినిమా. దంగల్, బాహుబలి 2 తర్వాత ఇదే హయ్యెస్ట్ గ్రాసర్ కాగా...1719 కోట్ల రూపాయల మార్క్ ను వేగంగా అందుకున్న మొదటి సినిమాగా పుష్ప 2 నిలిచింది. అది పక్కన పెడితే హిందీ బెల్ట్ ను అల్లాడించేస్తున్నాడు మొల్లేటి పుష్ప రాజు. ఓన్లీ హిందీ మార్కెట్లోనే 22 రోజుల పూర్తయ్యే సరికి పుష్ప 2 సినిమా 740కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇది 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలోనే రికార్డు. ఇప్పటివరకూ స్త్రీ 2 సినిమా 586 కోట్ల రూపాయలు కేవలం బాలీవుడ్ లో సంపాదించి మొదటి స్థానంలో ఉండగా..రెండో స్థానంలో జవాన్, పఠాన్ సినిమాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు బన్నీ పుష్ప 2 తో ఏకంగా 700 కోట్ల రూపాయల క్లబ్ ను సృష్టించాడు. రీలైజైన 3వారంలోనూ హిందీలో 100కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2. ఇది కూడా 100ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో రికార్డు. ఇలా అసలు హిందీ హీరోలకు నిద్ర లేకుండా చేస్తూ ఏ మాత్రం అందుకోలేని రికార్డులను సెట్ చేసే విధంగా దూసుకుపోతున్నాడు బన్నీ. సంక్రాంతి వరకూ అక్కడ కూడా పెద్ద రిలీజులు లేవు కాబట్టి పుష్ప 2 జోరు ఇలానే కొనసాగితే 800-1000కోట్లు కేవలం హిందీ నుంచే లాగొచ్చని చెబుతున్నారు.