అన్వేషించండి

Sri Mukha Lingam Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP Desam

 ప్రస్తావన పరంగా 2800 సంవత్సరాల చరిత్ర..చారిత్రక ఆధారాల ప్రకారం 10వ శతాబ్దం నుంచి వెలుగొందుతున్న ఆలయం..ఎలా చూసినా వేల సంవత్సరాల చరిత్ర శ్రీముఖలింగం సొంతం. శ్రీముఖ లింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. కాల క్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం చరిత్ర, స్థలపురాణం మహాశివరాత్రి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీలో.ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.
ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె వొకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం. భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.
మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Price Hike: పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌ ధరలు పెంపు!  ప్రజలపై ఎంత భారం పడుతుందంటే?
పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌ ధరలు పెంపు!  ప్రజలపై ఎంత భారం పడుతుందంటే?
Nara Lokesh: పనితీరే ప్రచారం - విద్యాశాఖలో నారా లోకేష్ సరికొత్త సైలెంట్ విప్లవం!
పనితీరే ప్రచారం - విద్యాశాఖలో నారా లోకేష్ సరికొత్త సైలెంట్ విప్లవం!
Andhra Labor Adda: ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన
ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News:పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
Tamil Nadu Elections: తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
Bhagavad Geeta: భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
భగవద్గీత For GenZ: ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Embed widget