MS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP Desam
తలా మహేంద్ర సింగ్ ధోని..చెన్నై సూపర్ కింగ్స్ కి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచి పెట్టిన కెప్టెన్ కూల్ చెన్నైలో అడుగు పెట్టాడు. ధోని వస్తే పండగే కదా మరెందుకు రా ఏడుస్తున్నావ్ అనుకుంటున్నారు కదా. ధోని వేసుకొచ్చిన టీ షర్టే దీనికి కారణం. చెన్నై ఎయిర్ పోర్ట్ లో నుంచి ఓ బ్లాక్ టీ షర్ట్ తో బయటకు వచ్చిన ధోనీ మీడియాకు హాయ్ చెబుతూ తన వెహికల్ ఎక్కి హోటల్ కి వెళ్లిపోయాడు. అయితే ఆ టీషర్ట్ ఏంటో వెరైటీగా ఉందని క్లోజ్ గా చూస్తే అర్థమయ్యేది ఏంటంటే అది మోర్స్ కోడ్. 1999 వరకూ యాక్టివ్ గా ప్రపంచమంతా వాడిన ఓ మోర్స్ కోడ్ ను తన టీషర్ట్ పై ఎందుకు ధరించాడు అసలు దాని అర్థం ఏంటీ తెలియాలంటే మనకు మోర్స్ కోడ్ ఆల్ఫాబెట్ ఏంటో తెలియాలి. మీకోసం ఏబీపీదేశం మోర్స్ కోడ్ ఆల్ఫాబెట్ కూడా చూపిస్తోంది. సో ఈ షీట్ మోర్స్ కోడ్ ఆల్ఫాబెట్ . మనకు ఏబీసీడీలు ఇంగ్లీషులు లో ఉన్నట్లే మోర్స్ కోడ్ ఈ కాంబినేషన్ ఆఫ్ డాట్స్ అండ్ డాషెస్ ఉంటాయి. సో ఇప్పుడు ధోని టీషర్ట్ మీద ఏం ఉందో తెలియాలంటే ఆయన టీషర్ట్ మీద ఉన్న ఒక్కో కోడ్ లెటర్ ను తీసుకుని మోర్స్ కోడ్ షీట్ సాయంతో డీ కోడ్ చేద్దాం. ముందు పై లైన్ లో ఉన్నది ఏంటంటే O N E. రెండో లైన్ లో L A S T. మూడో లైన్ లో T I M E చూశారు కదా సేమ్ టూ సేమ్. డీ కోడ్ చేశాం. ఇప్పుడు మొత్తం లైన్ ఏంటంటే One last Time లో అంటే ఇదే చివరాఖరు. ధోని ఏం చెప్తున్నాడో అర్థం అవుతోంది కదా. తను ఆడుతున్న ఈ ఐపీఎల్ లే తనకు ఆఖరి సీజన్ అని చెప్తున్నాడు. అందుకోసమే ఈ మోర్స్ కోడ్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పటికే 43ఏళ్ల వయస్సులో ఉన్న ధోని కేవలం ఈ ఐపీఎల్ కోసమే ఏడాదంతా తన ఫిటెనెస్ కు సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి 2019లోనే తప్పుకున్న ధోని...2008 నుంచి ఇప్పటివరకూ 18ఏళ్లుగా ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఐపీఎల్ ఆడాడు. ఇప్పుడు ధోని ఇచ్చిన ఈ షాకుతో ఆయన అభిమానులు గుక్క పట్టి ఏడ్వటం ఖాయం. పైగా ఆ లెజెండ్ కు గ్రాండ్ ఫేర్ వెల్ పలకటానికి ఈ సారి స్టేడియాలు పసుపు సముద్రంగా మారిపోవటం ఖాయం.





















