అన్వేషించండి

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?

Posani Krishna Murali Arrest: నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ రాజకీయ వర్గాలలో సంచలనం అయ్యింది.‌ ఆయన అరెస్ట్ తర్వాత టార్గెట్ ఎవరు అనేది చర్చనీయాంశం అవుతోంది.

సినీ నటుడు, దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) అరెస్టుతో ఏపీ ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పోసాని బూతులతో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి.‌ ఆయన మీద కూటమి పార్టీల అభిమానులు పలు కేసులు పెట్టారు. వాటి ఆధారంగా అరెస్టు జరిగింది. అయితే, ఇప్పుడు పోసాని అరెస్టు తర్వాత టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.

పోసాని తర్వాత లిస్టులో ఉన్నది శ్రీ రెడ్డి?
బూతులకు మూల్యం చెల్లించక తప్పదా?పోసాని అరెస్టు తర్వాత ఇటు సినిమా, అటు రాజకీయ వర్గాలలో నటి శ్రీ రెడ్డి పేరు బలంగా వినపడుతోంది. ఆవిడ చేసిన సినిమాలు తక్కువ. అంతకు ముందు యాంకరింగ్ చేశారు. టీవీ షోలో న్యూస్ రీడర్ కింద పని చేశారు. అప్పట్లో ఆవిడ పాపులర్ కాదు... తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు ఎప్పుడు అయితే నగ్న ప్రదర్శన చేశారో ఆ తరువాత ఆవిడ పాపులర్ అయ్యారు. అప్పుడు కూడా అవకాశాలు రాలేదు. కానీ, ఎప్పుడు అయితే వైసిపి టర్న్ తీసుకున్నారో అప్పటి నుంచి శ్రీ రెడ్డి వార్తల్లో వ్యక్తి అయ్యారు.

తనను తాను వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిగా శ్రీరెడ్డి పేర్కొంది. వైసిపి పార్టీకి మద్దతుగా, ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ... ఆ పార్టీ ప్రత్యర్థుల మీద బూతులతో శ్రీ రెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ నారాను అయితే పప్పు అని సంబోధించిన వీడియోలు కోకోల్లలు. పవన్ కళ్యాణ్ మీద అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నీచమైన కామెంట్లు చేసింది.‌ శ్రీ రెడ్డి మీద తెలుగుదేశం జనసేన పార్టీ క్యాడర్ నుంచి నాయకులు వరకు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‌ పోసాని తర్వాత లిస్టులో ఉన్నది ఆవిడ పేరేనని, ఆమె అరెస్టు కావడం కన్ఫర్మ్ అని రాజకీయ వర్గాలలో వినబడుతోంది.

పోసాని న్యాయవాది సైతం అరెస్ట్ తీరు సరికాదని చెబుతున్నారు తప్ప... అరెస్ట్ అక్రమం అని చెప్పడం లేదు. వైసీపీ సానుభూతిపరుల చెవిలో ఆ ముక్క పడిందో? లేదో? పోసాని గానీ, శ్రీ రెడ్డి గానీ మాట్లాడిన మాటలను వాళ్ళ తరఫు వాదించే న్యాయవాదులు సైతం వెనకేసుకు రాలేని పరిస్థితి నెలకొంది. 

Also Read: సూపర్‌ స్టార్‌తో బుట్ట బొమ్మ... రజనీ 'కూలి'లో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ వచ్చేసింది

తెలుగుదేశం, జనసేన,‌ భారతీయ జనతా పార్టీల కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత... గతంలో గీత దాటి, హద్దు మీరి ప్రవర్తించిన ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా రాయలేని భాషలో బూతులతో విరుచుకుపడిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తారని సంకేతాలు బలంగా వెళ్లాలి. దాంతో శ్రీ రెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, లోకేష్ - ఇద్దరికీ క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేశారు. అయినా గతంలో మాట్లాడిన బూతులకు, వ్యక్తిగత దూషణలకు మూల్యం చెల్లించక తప్పదనే సమాచారం అందుతోంది.

పోసాని అరెస్టు తర్వాత కూటమి ప్రభుత్వం మీద వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణంగా వ్యవహరిస్తుందని పేర్కొంటున్నారు. వాళ్లకు ధీటుగా కూటమి ప్రభుత్వ సానుభూతిపరులు పోసాని గతంలో మాట్లాడిన బూతు పురాణాన్ని బయటకు తీశారు. శ్రీ రెడ్డి అరెస్టు తర్వాత కూడా ఆవిడ పట్ల సానుభూతి కంటే వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలు పుష్కలంగా‌ ఉన్నాయి.

Also Read'శబ్దం' ట్విట్టర్ రివ్యూ: రీ రికార్డింగ్‌తో భయపెట్టిన తమన్... ఆయనే అసలు హీరో - ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్‌ టాక్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Pakistani Latest News: విమానాశ్రయాలు, విమానాల్లో ఫొటోలు, వీడియోలు నిషేధం- కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
విమానాశ్రయాలు, విమానాల్లో ఫొటోలు, వీడియోలు నిషేధం- కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
David Warner in Robinhood: 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
US And Bangladesh Arms Deal: బంగ్లాదేశ్‌కు భారీగా ఆయుధాలు అమ్మేందుకు అమెరికా డీల్! భారత్‌ ఇప్పుడు ఏం చేయాలి?
బంగ్లాదేశ్‌కు భారీగా ఆయుధాలు అమ్మేందుకు అమెరికా డీల్! భారత్‌ ఇప్పుడు ఏం చేయాలి?
Embed widget