News
News
వీడియోలు ఆటలు
X

Bichagadu 2 Trailer: సిస్టర్ సెంటిమెంట్ 'బిచ్చగాడు 2'లో కోర్టు కేసు ఏమిటి? - ట్రైలర్ చూశారా?

విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘బిచ్చగాడు -2’. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

FOLLOW US: 
Share:

తనదైన మార్క్ చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని.  2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్, సంచలన విజయాన్ని అందుకున్నారు.  సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసంతో మెప్పించాడు. ఇదే మూవీని తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. ఆ టైటిల్ చూసి మొదట్లో అంతా ఇదేం పేరు అనుకున్నారు. కానీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజయ్ నటనకు ఫిదా అయ్యారు. ఆయనను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా‘బిచ్చగాడు-2’ వస్తోంది. మే 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.

ఆకట్టుకుంటున్న బిచ్చగాడు -2’ ట్రైలర్

విజయ్ గురుమూర్తి. ఇండియాలో 7వ అత్యంత ధనవంతుడు. లక్ష కోట్ల రూపాయలకు వారసుడు అంటూ దేవ్ గిల్ చెప్పే మాటలతో ట్రైలర్ మొదలవుతుంది. స్టైలిష్ లుక్ లో స్పెషల్ ఫ్లైట్ లోకి ఎక్కబోతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత విజయ్ ఆంటోని అడ్డ నామాలతో పోలీస్ స్టేషన్ లోకి వస్తూ కనిపిస్తారు. ఓవైపు ధనవంతుడిగా మరోవైపు అడ్డనామాలు పెట్టుకున్న వ్యక్తిలా కనిపించారు.  ఆ తర్వాత విజయ్ గురుమూర్తి హత్యకు గురైనట్లు, ఆ కేసు విచారణ కోర్టులో జరుగుతున్నట్లు చూపిస్తారు. ఈ కేసులో సత్య(విజయ్ మరో క్యారెక్టర్) అనే వ్యక్తిపై హంతకుడిగా  అభియోగాలు నమోదవుతాయి. ఇదో భిన్నమైన కేసు అని న్యాయవాదులు చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. సత్య కోర్టుకు చేరుకోగానే యాంటీ బికిలీ అంటూ జనాలు నినాదాలు చేస్తారు. అదే సమయంలో  ఓ వ్యక్తిని చంపి ఎడారిలో పారేసినట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఓ చిన్న బాబు తన చెల్లితో కలిసి రోడ్డు మీద అడుక్కోవడం కనిపిస్తుంది. అదే సమయంలో ఆ బాలుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. అన్న కోసం చెల్లి పోలీసు వెహికిల్ వెంట పరిగెత్తుతుంది. మరోవైపు ఆ యువకుడు సంచితో కత్తులు పెట్టుకుని వెళ్తూ ఎవరినో చంపినట్లు చూపిస్తారు. ఇంతకీ ఆ పిల్లాడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? విజయ్ గురుమూర్తిని సత్య ఎందుకు చంపాడు? విజయ్ గురుమూర్తికి సత్యకు ఉన్న సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా కథ ఏంటి అనేది ఎక్కడా రివీల్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అయితే, అద్భుతమైన టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!

విజయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బిచ్చగాడు -2’

‘బిచ్చగాడు’ మూవీకి శశీ దర్శకత్వం వహించారు. అయితే, ‘బిచ్చగాడు-2’కు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా,కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ సన్నివేశాలను సైతం డూప్ లేకుండా ఆయన స్వయంగా చేశారు. మలేషియాలో ఈ మూవీని చిత్రీకరిస్తున్న సమయంలో ఓ యాక్షన్ సన్నివేశంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. గాయాల నుంచి కోలుకున్న విజయ్, ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కు రెడీ అవుతున్నారు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్ గా చేస్తోంది.  

మే 19న విడుదల కానున్న ‘బిచ్చగాడు -2’

విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌ పై ఆయనే స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు తొలుత విజయ్ ఆంటోని ప్రకటించారు. కానీ, కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. మే 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.  

ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘స్నీక్ పీక్ ట్రైలర్’ను విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా కాన్సెప్ట్‌ ను రివీల్ చేశారు. సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రక్తం, శరీరంలోని ఇతర అవయవాలు మార్చినట్లు మెదడును కూడా ట్రాన్స్‌ ప్లాంట్ చేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఒక శాస్త్రవేత్త ఈ ట్రైలర్‌లో చెబుతారు. ఆయనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు. ఐజక్ న్యూటన్, మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మేధావులను మరింత ఎక్కువ కాలం బతికించవచ్చని శాస్త్రవేత్త తెలుపుతారు. మంచి వాళ్లు ఎక్కువ కాలం బతికితే ఓకే, హిట్లర్ వంటి చెడ్డవారు, నియంతలు ఎక్కువ కాలం బతికితే ప్రజలకు నష్టం కదా అని ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటారు. ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని దేవ్ గిల్ (మగధీర సినిమాలో విలన్) ఇంట్లో కూర్చుని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ట్రైలర్‌ను క్లోజ్ చేశారు. ట్రైలర్‌లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనకాడకుండా ఒక పెద్ద హీరో సినిమా మీద పెట్టినంత ఖర్చు ఈ సినిమా మీద పెట్టినట్లు విజువల్స్ చూసి చెప్పేయవచ్చు. లావిష్ బిల్డింగ్‌లు, ఫారిన్ లొకేషన్లతో చూడటానికి విజువల్ ట్రీట్‌లా ఉంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Antony (@vijayantony)

Read Also: భూత కోలా వేడుకల్లో రిషబ్ శెట్టి - 'కాంతార' ప్రీక్వెల్ చిత్రీకరణకు ముందు... 

Published at : 29 Apr 2023 01:16 PM (IST) Tags: Kavya Thapar Vijay Antony Bichagadu 2 Pichaikkaran 2 Bichagadu 2 Trailer Pichaikkaran 2 trailer

సంబంధిత కథనాలు

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!