అన్వేషించండి

Krithi Shetty: బేబమ్మ ఆశలన్నీ ఆ మూడు తమిళ సినిమాల మీదే... హిట్ కొట్టి మళ్ళీ టాలీవుడ్ డోర్స్ ఓపెన్ చేయమ్మా

తెలుగు స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్న బేబమ్మ అనూహ్యంగా రేసులో వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం తమిళ సినిమాలకు పరిమితం అయ్యింది. తెలుగులో మళ్ళీ డోర్స్ ఓపెన్ కావాలంటే ఆ మూడు హిట్ కావాలి. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానానికి వెళుతుందని అందరూ అంచనా వేసిన కృతి శెట్టి (Krithi Shetty) కెరీర్ 2024లో డీలా పడింది. 'ఉప్పెన'తో 2021లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 'బేబమ్మ'గా తెలుగు ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. అదే ఏడాది వచ్చిన 'శ్యామ్ సింఘ రాయ్' కూడా హిట్. ఆ తర్వాత ఏడాది 2022లో వచ్చిన 'బంగార్రాజు'తో హ్యాట్రిక్ హిట్ హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కృతి శెట్టి.

హ్యాట్రిక్ హిట్స్‌ తర్వాత వరుస ఫెయిల్యూర్స్!
హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వచ్చిన 'వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు కృతీ శెట్టికి డిజాస్టర్ రిజల్ట్స్ అందించాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పెద్దగా ఆడకపోయినా కృతి శెట్టి నటనకు పేరు వచ్చింది. మంచి అంచనాలతో వచ్చిన 'కస్టడీ' (2023) కూడా ఆడలేదు. ఇక, గతేడాది (2024)లో కృతి శెట్టి తెలుగులో 'మనమే'లో నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. కానీ మలయాళంలో టోవినో థామస్‌తో ఆమె నటించిన 'ఏఆర్ఎమ్' సినిమా కేరళలో సూపర్ హిట్ అయింది.

Also Readవిలన్‌తో బాలకృష్ణ, కమల్ హాసన్, నాగార్జునకు మాటల్లేవ్... ఈ సినిమాల్లో అదే స్పెషాలిటీ మరి

బేబమ్మ అసలు అన్నీ తమిళ సినిమాల మీదే
Krithi Shetty Upcoming Movies 2025: ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన మూడు సినిమాల రిలీజ్‌లు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే అవన్నీ తమిళ సినిమాలే కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కార్తి హీరోగా వస్తున్న 'వా... వాతియార్'తో పాటు 'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ సరసన 'LIC -లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీల్లో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వీటిలో 'ఎల్ఐసి' సినిమాకు నయనతార ప్రొడ్యూసర్ కాగా... ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. ఇవి రెండూ కాకుండా 'జయం' రవి హీరోగా వస్తున్న ఫాంటసీ సినిమా 'జీనీ'లోనూ కృతి శెట్టే హీరోయిన్. ఈ మూడు సినిమాలు తెలుగులోనూ డబ్ అవడం ఖాయం. వీటిలో కనీసం రెండు సక్సెస్ అయినా తనకు మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ స్టార్‌డమ్ పెరుగుతుందనే ఆశలో బేబమ్మ ఉంది. ఈ అమ్మాయిని టాలీవుడ్ ఆడియన్స్ మర్చిపోయే స్థితికి వచ్చేసింది. ఇప్పటికే శ్రీలీల నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న కృతి శెట్టి కెరీర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలపడాలంటే ఈ మూడు సినిమాలే కీలకం. మరి ఈ ఏడాది 2025లో బేబమ్మ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. తెలుగులో ఆల్రెడీ కొత్త సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్టు టాక్. రెండు మూడు కథలు విన్నారట. దర్శక నిర్మాతలతో ఆవిడ చర్చలు సాగిస్తున్నారట.

Also Readఎవరీ స్టీఫెన్ దేవస్సే? 'కన్నప్ప'కు మ్యూజిక్ చేసే ఛాన్స్ రావడానికి పదేళ్ల ముందు అమరావతి శంకుస్థాపనలో చితక్కొట్టిన కుర్రాడు ఇతడేనని తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Nagababu: ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABPMS Dhoni Dance in Pant Sister Marriage | అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేసిన ధోనీ | ABP DesamHow To Use Shakthi App | శక్తి యాప్ తో ఎక్కడికెళ్లినా సేఫ్ గా ఉండండి | ABP DesamChitrada Public Talk | చిత్రాడలో జనసేన విజయకేతనం సభపై స్థానికుల అభిప్రాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Nagababu: ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Hyderabad News: హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
Toxic FIRST review: 'టాక్సిక్' ఫస్ట్ రివ్యూ... యశ్ మూవీపై హైప్ డబుల్ చేస్తున్న 'జాన్ విక్' యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కామెంట్స్
'టాక్సిక్' ఫస్ట్ రివ్యూ... యశ్ మూవీపై హైప్ డబుల్ చేస్తున్న 'జాన్ విక్' యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కామెంట్స్
Telangana Ration Cards: రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
Janasena Plenary: జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు
జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు
Embed widget