By: ABP Desam | Updated at : 29 Apr 2023 01:09 PM (IST)
గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు! (Image Courtesy : Instagram Memers)
తమిళనాడులో కుష్బూ కోసం అభిమాని గుడి కట్టారు. నయనతార, నిధి అగర్వాల్, నమితకు కూడా గుళ్ళు కట్టారు. అయితే, అవన్నీ తమిళనాడులో! తెలుగు నాట ఓ కథానాయికకు గుడి కట్టడం అనేది సమంత (Samantha For Temple)తో మొదలు అయ్యిందని చెప్పాలి.
గుడి కట్టడం బావుంది కానీ...
Samantha Temple : సమంత కోసం ఆమె వీరాభిమాని, గుంటూరులోని బాపట్లలో ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ గుడి కట్టారు. ఈ సంగతి తెలిసిందే. సమంత పుట్టిన రోజు (Samantha Birthday) సందర్భంగా నిన్న (ఏప్రిల్ 28, శుక్రవారం) గుడి ఓపెన్ చేశారు. కేక్ కట్ చేయడంతో పాటు గ్రామస్థులు, అభిమానులను పిలిచి గ్రాండ్ ఈవెంట్ చేశారు. అక్కడి వరకు బావుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలు అయ్యింది. అయితే, గుడిలో సమంత రూపమే ఒక రేంజ్ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది.
సమంత ఎక్కడ ఉంది సార్?
సందీప్ కట్టించిన గుడిలో బొమ్మ సమంతలా లేదనేది నెటిజనులు చెప్పే మాట. ఆ మాట చెప్పడమే కాదు, ట్రోల్స్ చేస్తున్నారు. 'బావుందన్నా... నిజంగా బావుంది అన్నా' అని ఒకరు కామెంట్ చేస్తే, 'అక్కడ సమంత లేదు కదా సార్! మరి, టెంపుల్ ఏంటి?' అని ఇంకొకరు మీమ్ క్రియేట్ చేశారు.
'టెంపుల్ ఓకే, మరి సమంత ఎక్కడ?', 'గుడి ఉంది కానీ సమంత లేదు' అంటూ ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు జనాలు. సమంత మీద అభిమానంతో గుడి కట్టించాలని సందీప్ అనుకోవడం, కట్టించడం తప్పు లేదు కానీ సమంత రూపాన్ని కరెక్టుగా తీసుకొచ్చే శిల్పిని ఎంపిక చేసుకుని ఉంటే బావుండేదని మరికొందరు సలహా ఇస్తున్నారు. అదీ సంగతి! గుడి కట్టించినందుకు అభినందనలు అందుకోవాల్సింది పోయి విమర్శలు ఎదుర్కొంటున్నారు సందీప్! ఒక్కసారి ఆ గుడి మీద వస్తున్న ట్రోల్స్ చూస్తే...
Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?
ప్రస్తుతం లండన్‌లో సమంత!
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందుతున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం ఇప్పుడు లండన్ సిటీలో ఉన్నారు సమంత. అందులో వరుణ్ ధావన్ జోడీగా ఆమె నటిస్తున్నారు. బర్త్ డే రోజు కూడా లీవ్ తీసుకోలేదట.
Also Read : మహేష్ కోసం 'అరవింద...'లో బసిరెడ్డి కంటే భయంకరంగా - జగపతి బాబు
సమంత చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట.
'ఖుషి' చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి. ఇది కాకుండా 'సిటాడెల్' వెబ్ సిరీస్ సెట్స్ మీద ఉంది.
'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?
Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్
HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?
Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!