Dawood Ibrahim: బాలీవుడ్ పై ఇప్పటికీ దావూద్ నీడ - మాఫియాడాన్ డ్రగ్ పార్టీలకు హాజరైన శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ - వెలుగులోకి సంచలన విషయాలు
Shraddha Kapoor: మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం ఇచ్చే డ్రగ్ పార్టీలకు బాలీవుడ్ తారలు హాజరైనట్లుగా తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రద్ధాకపూర్, నోరా ఫతేహి ఈ జాబితాలో ఉన్నారు.

Dawood Ibrahim drug parties: ముంబై పోలీసుల యాంటీ-నార్కొటిక్స్ సెల్ (ANC) దావూద్ ఇబ్రహీం సంబంధిత భారీ డ్రగ్స్ సిండికేట్‌ను అరెస్టు చేసింది. వీరు డ్రగ్ ట్రాఫికర్లు, బాలీవుడ్ నటులు, మోడల్స్, ర్యాపర్లు, డైరెక్టర్లు, దావూద్ బంధువులు కలిసి జరిగిన డ్రగ్స్ పార్టీల గురించి ఒప్పుకున్నారు. ఈ సిండికేట్‌ను దావూద్ సహచరుడు, సలీం దోలా దుబాయ్ నుంచి నడిపారని, అతని కుమారుడు తాహిర్ దోలా UAE నుంచి వచ్చి కీలక సమాచారం ఇచ్చాడని గుర్తించారు. తాహిర్ ప్రకారం, భారత్‌లోనూ విదేశాల్లోనూ జరిగిన పార్టీల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ముంబై పోలీసుల యాంటీ-నార్కొటిక్స్ సెల్ దర్యాప్తులో అరెస్టులో ఉన్న ట్రాఫికర్లు డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్టు ఒప్పుకున్నారు. మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేసినట్టు తెలిసింది.
తాహిర్ దోలా అనే దావూద్ అనుచరుడ్ని పోలీసులు పట్టుకున్నారు. అతని రిమాండ్ కాపీ ప్రకారం, భారత్‌లోనూ విదేశాల్లోనూ పార్టీలు ఏర్పాటు చేసి, డ్రగ్స్ సరఫరా చేశాడు. మరో డ్రగ్ పెడలర్ మహ్మద్ సలీం మహ్మద్ దుబాయ్ నుంచి డిపోర్ట్ అయ్యి, ఘట్కోపర్ యాంటీ-నార్కొటిక్స్ సెల్ యూనిట్ కస్టడీలో ఉన్నాడు. మార్చి 2024లో మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలో రూ.252 కోట్ల మెఫెడ్రోన్ సీజర్ కేసులో అరెస్టయ్యాడు. అతను ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్‌కు చెందినవాడని గుర్తించారు. లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచ్‌లు, ఖరీదైన దుస్తులతో అతనికి 'లావిష్' అనే నిక్ నేమ్ కూడా వచ్చింది. అతను కూడా భారత్, విదేశాల్లో పార్టీలు ఏర్పాటు చేసినట్టు ఒప్పుకున్నాడు.
ఈ దర్యాప్తు దావూద్ సంబంధిత ఇతర డ్రగ్ ట్రాఫికర్లు కూడా సెలబ్రిటీలకు పార్టీలు ఏర్పాటు చేశారా అని తనిఖీ చేస్తోంది. వీరు చెప్పిన పేర్లలో బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ర్యాపర్ లోకా , నటి శ్రద్ధా కపూర్, ఓరె, దర్శకులు అబ్బాస్-ముస్తాన్ , నటి నోరా ఫతేహి, దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్, శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధార్థ్ కపూర్ , జిషాన్ సిద్దీకీ కూడా ఈ పార్టీల్లో పాల్గొన్నవారిలో ఉన్నారు. జిషాన్ సిద్ధిఖీ తండ్రి బాబా సిద్దీకీ అక్టోబర్ 2024లో హత్యకు గురయ్యాడు. తాహిర్ దోలా రిమాండ్ కాపీ ప్రకారం వీరందరితో పార్టీలు ఏర్పాటు చేసి, వారికి డ్రగ్స్ సరఫరా చేశానని చేశాడు.
Shraddha Kapoor, her brother Siddhanth Kapoor, dancer Nora Fatehi, politician Zeeshan Siddiqui, and other high-profile celebrities have been named in a Rs 252 crore drug trafficking racket.
— ︎ ︎venom (@venom1s) November 14, 2025
Parties were held where drugs were supplied.
They will be investigated by the police. pic.twitter.com/kksnAuF6Lo
దావూద్ ఇబ్రహీం అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్, ఈ సిండికేట్‌కు ముఖ్య లింక్. అతని సహచరుడు సలీం దోలా డుబాయ్ నుంచమెఫెడ్రోన్ సరఫరా చేసేవాడు. తాహిర్ దోలా అతని కుమారుడు. శ్రద్ధా కపూర్ 2017లో అపూర్వ లఖియా డైరెక్టర్ గా 'హసీనా పార్కర్' సినిమాలో నటించారు. శ్రద్ధాకపూర్ దావూద్ సోదరి హసీనా పార్కర్ పాత్రలో నటించింది. ఆ సినిమాలో సిద్ధార్థ్ కపూర్ దావూద్ పాత్రలో నటించాడు. అలీషా పార్కర్ హసీనా పార్కర్ కుమారుడు. ANC ఈ డ్రగ్స్ సిండికేట్, పార్టీల్లో పాల్గొన్నవారిని గుర్తించడానికి, పేర్కొన్న సెలబ్రిటీలను ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.





















