![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Joker Malware Apps: మీకు తెలియకుండానే మీ డబ్బు కొట్టేస్తున్న జోకర్ మాల్వేర్.. వెంటనే ఈ 7 యాప్స్ డిలీట్ చేయండి
జోకర్ మాల్వేర్ మరోసారి పంజా విసురుతోంది. గూగుల్ రక్షణ వలయాన్ని ఛేదించుకొని మరీ యాప్‌ల్లో ప్రవేశిస్తోంది. గూగుల్ అధికారిక ప్లేస్టోర్‌లోకి వెళ్లి 15 పాపులర్ యాప్స్‌కు సోకినట్టు తెలిసింది.
![Joker Malware Apps: మీకు తెలియకుండానే మీ డబ్బు కొట్టేస్తున్న జోకర్ మాల్వేర్.. వెంటనే ఈ 7 యాప్స్ డిలీట్ చేయండి Joker Malware Google Play store Delete These 7 Apps Color Message, Safety AppLock From Your Android Phone cybersecurity Alert Joker Malware Apps: మీకు తెలియకుండానే మీ డబ్బు కొట్టేస్తున్న జోకర్ మాల్వేర్.. వెంటనే ఈ 7 యాప్స్ డిలీట్ చేయండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/21/90dd78ce4b749bdbf0ed7aa4ed1c7c51_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు అలర్ట్!! జోకర్ మాల్వేర్ మరోసారి పంజా విసురుతోంది. గూగుల్ రక్షణ వలయాన్ని ఛేదించుకొని మరీ యాప్‌ల్లో ప్రవేశిస్తోంది. గూగుల్ అధికారిక ప్లేస్టోర్‌లోకి వెళ్లి 15 పాపులర్ యాప్స్‌కు సోకినట్టు తెలిసింది. వీటిని వెంటనే తొలగించాలని మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో హెచ్చరించింది.
గతేడాదీ జోకర్ మాల్వేర్ యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌లో చేరింది. ఎంతో కష్టపడి గూగుల్ ఆ మాల్వేర్‌ను తొలగించింది. అయినప్పటికీ తన కోడ్‌ను మార్చుకొని గూగుల్ సెక్యూరిటీ కళ్లుగప్పి మళ్లీ ప్లేస్టోర్‌లోకి చేరుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కైలోని టత్‌యానా షిష్కోవా అనే అనలిస్టు గూగుల్‌లో 14 యాప్‌లకు జోకర్ మాల్వేర్ సోకిందని ఇంతకు ముందే చెప్పారు.
జోకర్ మాల్వేర్‌ను 2017లో తొలిసారి గుర్తించారు. ప్రతిసారీ ఇది గూగుల్‌కే సవాల్ విసురుతోంది. తాజాగా 'కలర్ మెసేజ్' యాప్‌కు జోకర్ మాల్వేర్ సోకిందని ప్రేడియో తెలిపింది. ఈ అప్లికేషన్‌ను 5 లక్షల మంది ఉపయోగిస్తుండటం గమనార్హం. ఈ అప్లికేషన్ రష్యన్ సర్వర్లతో అనుసంధానం అయినట్టు కనిపిస్తోందని ప్రేడియో పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఏడు యాప్‌లను మొబైల్స్ నుంచి తొలగించాలని సూచించింది.
జోకర్ మాల్వేర్ 'ఫ్లీస్‌వేర్' విభాగానికి చెందింది. ఈ మాల్వేర్ మనకు తెలియకుండానే డబ్బులను కొట్టేస్తుంది. మనకు సంబంధం లేని, అవసరం లేని ప్రీమియం సర్వీసులకు క్లిక్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబ్ చేయిస్తుంది. ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ యాడ్స్‌పై క్లిక్ చేసి అనుమతి లేకుండానే పెయిడ్ సర్వీసులను డబ్బులు చెల్లిస్తుంది. మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసేంత వరకు మీ డబ్బు పోయిందన్న విషయం గుర్తించలేరు. ఓ ఆన్‌లైన్ యాప్ లేదా సర్వీస్‌కు డబ్బు చెల్లిస్తున్నట్టు మీకు తెలియదు.
తొలగించాల్సిన యాప్స్ జాబితా
కలర్ మెసేజ్ (Color Message) , సేఫ్టీ యాప్ లాక్ (Safety AppLock), కన్వీనియెంట్ స్కానర్ 2 (Convenient Scanner 2), పుష్ మెసేజ్-టెక్ట్సింగ్ అండ్ ఎస్‌ఎంఎస్ (Push Message-Texting&SMS), ఎమోజీ వాల్‌పేపర్ (Emoji Wallpaper), సెపరేట్ డాక్ స్కానర్ (Separate Doc Scanner), ఫింగర్‌టిప్ గేమ్‌బాక్స్ (Fingertip GameBox).
Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్ చూడండి మరి!
Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!
Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)