అన్వేషించండి

Refrigerator Safety Tips: వేసవిలో ఫ్రిజ్‌ను రోజంతా ఆన్‌లోనే ఉంచితే మోటార్‌ దెబ్బతింటుందా?

Modern Refrigerators: వేసవి కాలంలో, సాధారణంగా, ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌తో ఎక్కువ పని ఉంటుంది, దాని బాధ్యతలు పెరుగుతాయి.

Running The Refrigerator Continuously For 24 hours: వేసవి కారణంగా ఇప్పుడు వాతావరణంలో వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల తాపానికి తట్టుకోవడానికి ప్రతి ఒక్కరి ఇంటిలో కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు) నిరంతరం పని చేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సమ్మర్‌ సీజన్‌లో ఫ్రిజ్‌లు చేయాల్సిన పని ఇంకా పెరుగుతుంది. చల్లటి నీరు అందించడం, కూల్‌డ్రింక్స్‌ & ఐస్‌క్రీమ్‌లను నిల్వ చేయడం, కూరగాయలు & ఆహార పదార్థాలు చెడిపోకుండా కాపాడడం వంటి పనులతో ప్రతి ఇంటి ఫ్రిజ్‌ ఇప్పుడు బిజీగా ఉంటుంది. సామాన్యుడికి అయినా, సంపన్నుడికి అయినా సమ్మర్‌ సీజన్‌లో రిఫ్రిజిరేటర్ అతి పెద్ద మద్దతుగా నిలుస్తుంది. అయితే, రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించడం గురించి ప్రజల మనస్సుల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ సందేహాలలో ఒకటి - రిఫ్రిజిరేటర్‌ నిరంతరం పని చేస్తుంటే ఎటువంటి సమస్య రాదా, దానిని రోజులో కొన్ని గంటలైనా ఆపివేయాలా?. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

రిఫ్రిజిరేటర్ గురించి వేర్వేరు వ్యక్తులకు, వారి అనుభవాల ఆధారంగా లేదా తెలుసుకున్న విషయాల ఆధారంగా వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది రిఫ్రిజిరేటర్‌ను రోజులో కొంతసేపు ఆపివేయాలని చెబుతారు. దీనికి వాళ్లు చెప్పే కారణం ఏంటంటే.. రిఫ్రిజిరేటర్ నిరంతరం పనిచేస్తూ ఉంటే మోటారు పాడైపోతుంది & దానిని మరమ్మతు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. మరికొందరి అభిప్రాయం ఇంకోలా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌ను ప్రతి రోజూ కాదు, వారానికి ఒకసారి రెండు, మూడు గంటలు స్విచ్ఛాఫ్‌ చేయాలని, ఆ విరామం సరిపోతుందని అంటారు. ఇప్పుడు మీరైనా, నేనైనా ఎవరి మాట నమ్మాలి, ఏ అభిప్రాయం నిజం అనుకోవాలి?.

సరైన సమాధానం ఏమిటి?
ఫ్రిజ్‌ను రోజులో కొంతసేపు ఆపాలా, వారానికి ఒకసారి ఆపాలా, ఎంతసేపు ఆపాలి అని రిఫ్రిజిరేటర్‌ కంపెనీ నిపుణులను అడిగినప్పుడు, వారు చెప్పిన సమాధానం ఏమిటంటే - ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి రిఫ్రిజిరేటర్‌ను ఆపాల్సిన పని లేదు. ఎందుకంటే, ఈ రోజుల్లో టెక్నాలజీ పూర్తిగా అప్‌డేట్‌ అయింది & ఇప్పుడు వచ్చే రిఫ్రిజిరేటర్లు వాంఛనీయ ఉష్ణోగ్రతను నిర్వహించే విధంగా తయారవుతున్నాయి. దీని అర్ధం, సరైన చల్లదనం వద్దకు చేరుకోగానే ఫ్రిజ్‌ మోటారు దానంతట అదే ఆగిపోతుంది, సరిగ్గా ఎయిర్‌ కండిషనర్‌ (AC) తరహాలోనే ఆగి ఆగి పని చేస్తుంది. మీ రిఫ్రిజిరేటర్‌ను రోజంతా ఆన్‌లోనే ఉంచినప్పటికీ, ఉష్ణోగ్రతలను సొంతంగా నిర్వహించునే సాంకేతికత కారణంగా దాని మోటారుపై ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి, రిఫ్రిజిరేటర్‌ను స్విచ్ఛాఫ్‌ చేయాల్సిన అవసరం లేదు.

రిఫ్రిజిరేటర్‌ను తప్పనిసరిగా ఆపాల్సిన సందర్భం
అవును, మీరు మీ ఇంట్లోని ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తుంటే, దానిని "తప్పనిసరిగా స్విచ్ఛాఫ్‌ చేయాలి". అంతేకాదు, ఫ్రిజ్‌ ప్లగ్‌ను కూడా సాకెట్‌ నుంచి తొలగించాలి. దీనివల్ల, అనుకోని కరెంట్‌ షాక్‌ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అప్పుడు తప్ప, మీ ఫ్రిజ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

ఆధునిక రిఫ్రిజిరేటర్లు ఉష్ణోగ్రతను నిర్వహించడం కోసం అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ & ఆఫ్ జరిగేలా రూపొందుతున్నాయి. కాబట్టి వాటిని మాన్యువల్‌గా ఆన్ & ఆఫ్ చేయవలసిన అవసరం లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Ayyappa swamy Temples : శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Ayyappa swamy Temples : శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Jatadhara OTT : సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
Embed widget