BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ ధమాకా ఆఫర్ - రూ.100కే ఏడాదంతా కాల్స్, నెలకు 3GB డేటా
BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది, తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా చేస్తుంది.

BSNL Rs 1198 Recharge Plan Details: ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం చిరాగ్గా అనిపిస్తుంటే, BSNL కొత్త ప్లాన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL, ఇప్పుడు ఒకే రీఛార్జ్‌పై పూర్తి 12 నెలల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది, ధర కూడా చాలా తక్కువ.
BSNL కొత్త ప్లాన్ ప్రత్యేకత ఏంటి?
BSNL కొత్త ప్లాన్ ధర కేవలం 1,198 రూపాయలు. ఇది 365 రోజుల పూర్తి చెల్లుబాటును (One Year Validity) అందిస్తుంది. ఇది, నెలకు కేవలం రూ. 100 ఖర్చుతో సమానం. తద్వారా, మీరు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఏడాది పాటు సుఖంగా ఉండవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు ప్రతి నెలా 3GB డేటా, 300 నిమిషాల కాలింగ్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా), 30 SMSలు పొందుతారు. ఈ ప్రయోజనాలన్నీ ప్రతి నెలా ఆటోమేటిక్‌గా రీస్టోర్ అవుతాయి. అంటే వినియోగదారుడు ఏమీ చేయనవసరం లేదు, ఒకసారి రీఛార్జ్ చేసుకుని ఏడాది పొడవునా టెన్షన్ లేకుండా ఉండవచ్చు.
ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్‌ల రేట్లు పెంచి జనం జేబులకు చిల్లు పెంచాయి. ఇవి రేట్లు పెంచిన నాటి నుంచి చాలా మంది BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, తక్కువ ధరకు ప్రైమరీ ఇంటర్నెట్ & కాలింగ్ సౌకర్యాలను కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ ముఖ్యంగా వృద్ధులు లేదా మొబైల్ ఎక్కువగా ఉపయోగించని వారికి బాగుంటుంది. వాళ్లు ప్రతి నెలా రీఛార్జ్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు, అవసరమైన సౌకర్యాలు కూడా పొందుతారు.
నెట్‌వర్క్ కవరేజీని జాగ్రత్తగా చూసుకోండి
BSNL తన నెట్‌వర్క్‌ను వేగంగా అప్‌గ్రేడ్ చేస్తున్నప్పటికీ, దాని 4G లేదా 5G సేవ ఇంకా కొన్ని చోట్ల పూర్తిగా ప్రారంభం కాలేదు. మీరు BSNL సిమ్ కొనాలని ఆలోచిస్తుంటే, ముందుగా మీ ప్రాంతంలో BSNL కవరేజీని చెక్ చేయండి. BSNL, కొత్తగా లైవ్ నెట్‌వర్క్ మ్యాప్‌ను కూడా ప్రారంభించింది, మీ ప్రాంతంలో ఏ BSNL నెట్‌వర్క్ అందుబాటులో ఉందో సులభంగా చూడవచ్చు. ఇది మీ ప్రాంతంలో నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది.
ఎయిర్‌టెల్ చవకైన ప్లాన్
ఎయిర్‌టెల్ చవకైన రీఛార్జ్ ప్లాన్ ధర 1,199 రూపాయలు. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో, యూజర్‌కు, ఏ నెట్‌వర్క్‌కు అయినా లోకల్ & STD కాలింగ్ పూర్తిగా ఉచితం. 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. రోజుకు 2.5 GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్‌కు ఉచిత సభ్యత్వం కూడా ఉంటుంది.
జియో రూ.189 ప్లాన్
భారతదేశంలో అతి పెద్ద టెలికాం జియో అందించే అత్యంత చవకైన ప్లాన్ ఇది. ధర కేవలం 189 రూపాయలు. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. 2 GB డేటా, అపరిమిత కాలింగ్ & 300 SMSలు కూడా పొందుతారు.





















