అన్వేషించండి

Discount on iPhone: ఐఫోన్ 15ని చవకగా కొనే ఛాన్స్‌ - చాలా ఫోన్ల మీద గ్రేట్‌ డీల్స్

Buying Opportunity For iPhone 15: ఐఫోన్ 15 మీద భారీ డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి & మీకు వేల రూపాయలు ఆదా అవుతాయి.

Amazon Offers Huge Discount on iPhone 15: ఆపిల్‌ ఐఫోన్ కొనాలని చాలామంది ఆశపడతారు. అయితే, అంత ధర పెట్టలేక వెనక్కు తగ్గుతారు. మీరు కూడా బడ్జెట్ కారణంగా మీ ఆలోచన మార్చుకుంటే, ఇప్పుడు ఒక గొప్ప అవకాశం మీ తలుపు తట్టింది. అమెజాన్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 15 మీద అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్‌ కింద, మీరు ఐఫోన్‌ 15ను భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు.

అమెజాన్‌ ఆఫర్‌ ఏంటి?
ఆపిల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 15 వాస్తవ ధర దాదాపు రూ.69,900. ప్రస్తుతం, ఇదే ఫోన్ అమెజాన్‌లో రూ.61,390కే అందుబాటులో ఉంది. అంటే అమెజాన్ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి కొనుగోలు చేయడం వల్ల మీరు రూ. 8,510 ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు, అది కూడా ఎటువంటి కూపన్ లేదా కోడ్ ఇబ్బంది లేకుండా!.

క్రెడిట్‌ కార్డ్‌తో 5% క్యాష్‌ బ్యాక్‌
ఈ అవకాశం ఇక్కడితో ముగిసిపోలేదు, మీ దగ్గర అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ‍‌(Amazon Pay ICICI Bank Credit Card) ఉంటే ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే మీకు 5% వరకు అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

పాత ఫోన్‌ మార్చుకుంటే మరింత డిస్కౌంట్
అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అద్భుతంగా ఉంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుని రూ. 22,800 వరకు అడిషనల్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. అయితే, ఈ విలువ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్‌, ఫోన్‌ ప్రస్తుత పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. మీ దగ్గర ఐఫోన్ 11 ఉండి, అది మంచి స్థితిలో ఉంటే, మీరు దాదాపు రూ. 13,500 ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అంటే, మీ మొత్తం పొదుపు రూ. 20,000 పైగా ఉండవచ్చు!

ఐఫోన్ 15 ప్రత్యేకతలు
HDR10, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే  
శక్తిమంతమైన ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్  
6GB RAM, 512GB వరకు స్టోరేజ్‌  
వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 3,349 mAh బ్యాటరీ  
గొప్ప కెమెరా నాణ్యత, అద్భుతమైన పనితీరు  

మీ పాత ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా లేదా మొదటిసారి ఐఫోన్‌ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నా ఈ డీల్ మీకు సూటవుతుంది.

Samsung Galaxy S23పై గొప్ప డీల్స్
మీరు ఆండ్రాయిడ్‌ను ఇష్టపడుతూ, శామ్‌సంగ్‌ నుంచి మంచి ఫోన్‌ కొనాలని ఆలోచిస్తుంటే.. శామ్‌సంగ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ Galaxy S23 బెస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో దాదాపు రూ. 10,000-12,000 తగ్గింపుతో లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ & బ్యాంక్ డిస్కౌంట్ ప్రయోజనం కూడా అందుకోవచ్చు.

OnePlus అభిమానుల కోసం OnePlus 12R
ఇటీవలే లాంచ్‌ అయిన OnePlus 12R మీద కూడా అమెజాన్‌లో రివార్డ్స్‌ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌ & రూ. 5,000-8,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శక్తిమంతమైన ప్రాసెసర్, గొప్ప డిస్‌ప్లే, లాంగ్‌లాస్టింగ్‌ బ్యాటరీతో  OnePlus 12Rను ప్యాక్‌ చేశారు.

గూగుల్‌ పిక్సెల్‌ 7a మీద వేల రూపాయల డిస్కౌంట్‌
మీరు ఫోటోగ్రఫీని ఇష్టపడితే, Google Pixel 7a ఒక గొప్ప ఎంపిక. దీని కెమెరా నాణ్యత ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 6,000-7,000 డిస్కౌంట్‌లో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ & బ్యాంక్ ఆఫర్‌లను కూడా కలుపుకుంటే డిస్కౌంట్‌ బెనిఫిట్‌ ఇంకా పెరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !

వీడియోలు

Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Mega Victory Mass Song Lyrics : మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
Prabhas Dating: 'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Embed widget