RR vs RCB Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 9వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP Desam
ఈ సీజన్ లో తొలిసారి సొంతగడ్డ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో దూసుకు రావాలని ప్లాన్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆశలు అడియాసలయ్యాయి. బెంగుళూరు చిన్న స్వామి అంటే డౌటే కానీ బయటి గ్రౌండ్స్ లో ఈ సీజన్ లో చెలరేగిపోతున్న ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. జయహో జైశ్వాల్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జైపూర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానిస్తే ఆర్ ఆర్ ఆరంభం నుంచే నత్త నడకన సాగింది. టెస్ట్ మ్యాచు ను తలపించే విధంగా ఓపెనర్లు జైశ్వాల్, సంజూ శాంసన్ ఆచి తూచి ఆడారు. ఎప్పుడైతే శాంసన్ ను కృనాల్ పాండ్యా అవుట్ చేశాడో అప్పటి నుంచే ఆర్ఆర్ గతి మారిపోయింది. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కుర్రాడు యశస్వి జైశ్వాల్ అద్భుతంగా ఆడేశాడు. 47 బాల్స్ లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 75పరుగులు చేసిన జైశ్వాల్ ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ ఫైటింగ్ స్కోరన్నా పెట్టడానికి రీజన్ అయ్యాడు.
2. పరాగ్& జురెల్ క్యామియోస్
జైశ్వాల్ సక్సెస్ అయినా శాంసన్ త్వరగా అవుటవ్వడంతో పరాగ్ ఆచి తూచి నెమ్మెదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. తొలుత జైశ్వాల్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీసిన పరాగ్...తర్వాత జోరు పెంచాడు 22 బాల్స్ లో 3 ఫోర్లు ఓ సిక్సర్ తో 30 పరుగులు చేసిన పరాగ్ ను యశ్ దయాల్ అవుట్ చేశాడు. పరాగ అవుటైనా, ఆ వెంటనే జైశ్వాల్ వెళ్లిపోయినా ధృవ్ జురెల్ పోరాడాడు. 23 బాల్స్ లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 35పరుగులు చేసిన జురెల్ అచ్చం పరాగ్ లానే మంచి క్యామియోస్ ఇవ్వటంతో 173 పరుగులు చేసి ఆర్సీబీ కి 174 టార్గెట్ ఇచ్చింది.
3. సాల్ట్ సూపర్ ఛేజింగ్
174 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్..కింగ్ కొహ్లీతో కలిసి రాజస్థాన్ బౌలింగ్ ను రఫ్పాడించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 65పరుగులు చేశాడు. ప్రధానంగా సాల్ట్ దూకుడుకు పవర్ ప్లేలోనే మ్యాచ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసిన ఆర్సీబీ సాల్ట్ అవుటయ్యే టైమ్ కి 8.4 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది.
4. జైపూర్ కోటలో విరాట్ మహారాజు
ఇక మిగిలిన పనిని దేవ్ దత్త పడిక్కల్ తోడుగా కింగ్ కొహ్లీ ముగించాడు. ముందంతూ స్లో పిచ్ కారణంగా స్లోగా ఆడిన కొహ్లీ మెల్లగా గేర్లు వేశాడు. ఎక్కడా తప్పిదం జరిగి మ్యాచ్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతూనే స్కోరు బోర్డును పరుగులు పెీట్టించాడు విరాట్ కొహ్లీ. 45 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 62పరుగులు చేసి ఛేజింగ్ లో తనకు తిరుగలేదని ప్రూవ్ చేశాడు. మరో ఎండ్ లో కొహ్లీ కి అండగా దేవ్ దత్త పడిక్కల్ కూడా దంచికొట్టాడు. 28 బాల్స్ లోనే 5ఫోర్లు, ఓ సిక్సర్ తో 40 పరుగులు చేసి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించేలా చేశాడు.
5. క్యాచెస్ విన్ మ్యాచెస్
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవటానికి ప్రధాన కారణం క్యాచ్ లు పట్టలేకపోవటం. సాల్ట్, కొహ్లీ, పడిక్కల్ ఇలా అందరూ క్యాచ్ లు ఇచ్చినా వాటిని పట్టుకుని సెట్ బ్యాటర్లను ఇంటికి పంపించలేకపోయింది రాజస్థాన్. ఫలితంగా చేజేతులా మ్యాచ్ ను దూరం చేసుకుంది.
ఈ విజయంతో ఆర్సీబీ 6 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి దూసుకువస్తే...రాజస్థాన్ మాత్రం ఏడోస్థానానికి పడిపోయింది.





















