Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!

2021, డిసెంబర్‌ 16న ఈ షేరు ధర రూ.584 వద్ద ముగిసింది. 2016లో ఇదే సమయానికి షేరు ధర రూ.118గా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ షేరు ఏంటంటే?

FOLLOW US: 

వీఐపీ ఇండస్ట్రీస్‌ ఐదేళ్ల కాలంలో మదుపర్లకు చక్కగా సంపదను సమకూర్చి పెట్టింది. 2021, డిసెంబర్‌ 16న ఈ షేరు ధర రూ.584 వద్ద ముగిసింది. 2016లో ఇదే సమయానికి షేరు ధర రూ.118గా ఉండటం గమనార్హం. అంటే ఈ ఐదేళ్ల కాలంలో మదుపర్లకు 395 శాతం లాభం వచ్చింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 116 శాతం పెరిగింది.

ఐదేళ్ల క్రితం వీఐపీ ఇండస్ట్రీస్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.4.92 లక్షలు చేతికి అందేవి. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర 5, 20, 50, 100, 200 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌కు పైనే ఉండటం గమనార్హం. మార్కెట్‌ విలువ రూ.7,928 కోట్లుగా ఉంది. ఈ ఏడాదిలో షేరు ధర 57 శాతం లాభపడింది. 2021, ఏప్రిల్‌లో రూ.309 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. సెప్టెంబర్‌ 9న రూ.668 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని అందుకొంది.

ఈ కంపెనీలో 11 మంది ప్రమోటర్లకు 50.28 శాతం వాటా ఉంది. ప్రజల వద్ద 1,18,081 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలో 49.72 శాతం వాటా. 20 మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు 16.47 శాతం పెట్టుబడులు పెట్టాయి. ఈ ఐదేళ్ల కాలంలో కంపెనీ పోటీదారైన సఫారీ ఇండస్ట్రీస్‌ 375 శాతం ర్యాలీ చేసింది.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీఐపీ ఇండస్ట్రీస్‌ లాభం 152 శాతం పెరిగి రూ.18.5 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ.35 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇక విక్రయాలు 221 శాతం పెరిగి రూ.330 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ లాభదాయకత నిలకడగా పెరుగుతుండటంతో కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు వీఐపీ ఇండస్ట్రీస్‌ షేర్లు కొనుగోలు చేయొచ్చని సిఫార్సు చేస్తున్నాయి!

నోట్‌: స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్‌, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!

Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!

Also Read: Digital Payments in 2021: క్రెడిట్‌ కార్డు యూజర్లు కేక! డిజిటల్‌ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు

Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్‌ స్కామ్‌ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!

Also Read: Rakesh Jhunjhunwala: 10 నిమిషాల్లో రూ.318 కోట్లు నష్టపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా!

Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్‌ చూడండి మరి!

Also Read: Koo App: మనసుకు నచ్చింది 'కూ'సేయండి.. దూసుకెళ్తున్న #KooKiyaKya క్యాంపెయిన్

Published at : 19 Dec 2021 05:14 PM (IST) Tags: Stock market multibagger Multibagger stock Multibagger Share Abp Desam Business VIP Industries

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్

Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్

Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ

Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ల్లో ఏది బెస్ట్?

Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ల్లో ఏది బెస్ట్?

Bad Time For Startups : స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !

Bad Time For Startups :  స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !

Petrol-Diesel Price, 4 July: నేడు ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు! మిగతా చోట్ల ఇలా!

Petrol-Diesel Price, 4 July: నేడు ఈ నగరాల్లో ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు! మిగతా చోట్ల ఇలా!

టాప్ స్టోరీస్

Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?

Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?

Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్

Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్

Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే

Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే

IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్‌దే - విజయానికి 119 పరుగులు!

IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్‌దే - విజయానికి 119 పరుగులు!