By: ABP Desam | Updated at : 19 Dec 2021 12:12 PM (IST)
Edited By: Murali Krishna
కూకియాక్యా
'కూ'.. సోషల్ మీడియాలో కొత్తదనంతో ముందుకు దూసుకుపోతోంది. మాతృభాషలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు 'కూ' అద్భుతమైన వేదికగా నిలిచింది. తాజాగా 'కూ' తన తొలి టెలివిజన్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాతృభాషలో ప్రతి ఒక్క యూజర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ఈ ప్రచారం ద్వారా 'కూ' చెబుతోంది. #KooKiyaKya అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రచారం అందినీ ఆకర్షిస్తోంది.
ఈ యాడ్‌ను ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో మొదలుపెట్టింది 'కూ' యాప్. తమ చుట్టూ ఉన్నావారితో తమకు నచ్చిన, వచ్చిన సొంతభాషలో అభిప్రాయాలు పంచుకోవాలని ఈ యాడ్ ద్వారా 'కూ' చెబుతోంది.
సొంత భాషే ముద్దు..
ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇంగ్లీష్ భాషలోనే సంభాషణలు ఉండేవి. కానీ 'కూ' వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది. యూజర్స్ తమ సొంతభాషలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే వెసులుబాటు కలిగింది. అందులోనూ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌తో పని లేకుండా మాతృభాషలోనే తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు యూజర్లు. ఓగ్లివీ ఇండియా ఈ క్యాంపెయిన్‌ను డిజైన్ చేసింది. లోకల్ ఫ్లేవర్లతో చిన్న చిన్న యాడ్‌లతో ఈ క్యాంపెయిన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోజువారీ మన జీవితంలో ఎదురయ్యే సంఘటనల మధ్యే ఈ క్యాంపెయిన్ నడవడంతో చూడటానికి కూడా లోకల్ ఫీలింగ్ కలుగుతోంది.
ఏమున్నా 'కూ'సేయండి..
ఈ క్యాంపెయిన్ ద్వారా 'కూ' ఇచ్చే సందేశం ఒక్కటే. 'మీ మనస్సులో ఏమనిపిస్తే అది 'కూ'లో చెప్పేయండి' ఇదే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం 'కూ' ఎంతో రీసెర్చ్ చేసింది. ఇంటర్నెట్ యూజర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎలా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు? ఇలాంటివాటిపై దృష్టి పెట్టి ఈ క్యాంపెయిన్ తీసుకువచ్చారు.
1.5 కోట్లు..
ఈ మేడ్ ఇన్ ఇండియా సోషల్ మీడియా వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ క్యాంపెయిన్ ఉపయోగపడుతోంది. 2020 మార్చిలో ప్రారంభమైన 'కూ' యాప్ ఇప్పటికే 1.5 కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 9 దేశీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా, అస్సామీ, గుజరాతీ సహా ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. రాజకీయ, క్రీడా, సినీ, మీడియా ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు 'కూ' యాప్‌ను వినియోగిస్తున్నారు.
వచ్చే ఏడాదికి 'కూ'ను వినియోగించే వారి సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: ABP Desam On Koo: తాజా వార్తల కోసం కూ యాప్‌లో ఏబీపీ దేశంను ఫాలో అవ్వండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Undavalli Arunkumar: స్కిల్ స్కామ్‌లో ఉండవల్లి పిల్ వేరే బెంచ్‌కు - ‘నాట్ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి
Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా
Hyderabad Metro: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు
Iraq: ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం
నిజ్జర్ హత్యలో విదేశీ హస్తం ఉంది, భారత్‌పై విషం కక్కిన కెనడా సిక్కు ఎంపీ
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
/body>