![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
మేడి ఇన్ ఇండియా యాప్ 'కూ' విదేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. నైజీరియా త్వరలోనే పూర్తి స్థాయి సేవలు అందించేందుకు సిద్ధమైంది.
![Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్ Nigeria is a new achievement for the Koo App in the world of languages Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/1f89047b1aa410d6ec08b8160d22deb3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్‌కు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక 'కూ' సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నైజీరియాలో 'కూ' యూప్ తన ఉనికిని చాటుకుంది. 500 భాషల కంటే ఎక్కువ ఉన్న నైజీరియాలో 'కూ' యూప్ త్వరలోనే సేవలు అందించనుంది. ఇంగ్లీష్ అనువాదం లేకుండా వారివారి మాతృభాషలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు 'కూ' వారికి ఉపయోగపడుతోంది.
భారత్‌లో హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మరాఠీ, బంగ్లా, అస్సామీ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషల్లో 'కూ' యాప్ సేవలందిస్తోంది. త్వరలోనే మరిన్ని భాషల్లో 'కూ' అందుబాటులోకి రానుంది. భారత్‌లానే నైజీరియా కూడా బహుభాషా, సంప్రదాయ దేశాల్లో ఒకటి. ఇగ్బో, హౌసా, ఫూలా, టివ్ ఇలా 500కు పైగా భాషలకు నైజీరియా నెలవు.
ఆఫ్రికాలోనే అత్యధిక జీడీపీ కలిగిన దేశం నైజీరియా. అలాంటి దేశంలో 'కూ' యాప్ గొప్ప ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో 'కూ' యాప్‌కు ఇదో అరుదైన మైలురాయి. నైజీరియా అధికారిక భాష ఇంగ్లీష్‌లో కూడా 'కూ' అందుబాటులో ఉంది.
2020 మార్చిలో..
ఆఫ్రికన్ వినియోగదారులు తమ మాతృభాషలో సమాచారాన్ని పంచుకునేందుకు, తమ ఆలోచనలను వ్యక్తం చేసేందుకు త్వరలోనే 'కూ' అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అక్కడ 'కూ' యాప్ వినియోగదారులు పెరుగుతున్నారు. త్వరలోనే నైజీరియాలో 'కూ' యాప్ విస్తరించనుంది.
2020 మార్చిలో 'కూ'యాప్‌ను ప్రారంభించారు. వినియోగదారులు మాతృభాషలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు 'కూ' అద్భుతమైన వేదికగా నిలిచింది. 2021 అక్టోబర్ నాటికి 1.5 కోట్ల డౌన్‌లోడ్‌ల మైలురాయిని 'కూ' దాటింది. రాజకీయం, క్రీడా, వాణిజ్య, సినిమా రంగాలకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు 'కూ'యాప్‌ను వినియోగిస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో గోప్యతపై ఎక్కువ ఆందోళన నెలకొంది. వినియోగదారులు కూడా తమ గోప్యతకు భంగం కలగకూడదని కోరుకుంటున్నారు. డేటా చోరీని తీవ్రంగా పరిగణిస్తారు. 'కూ'లో వినియోగదారులు తమ డేటా, గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని 'కూ' యాప్ హామీ ఇచ్చింది.
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)