Dating Vs One Night Stand: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఒకప్పుడు పెళ్లి తర్వాతే అన్ని అనేవారు. కానీ, ఇప్పుడు అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది?
![Dating Vs One Night Stand: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్? Dating Vs One Night Stand: Think twice before intercourse with a stranger Dating Vs One Night Stand: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/11/f5b2748058549b5c6ed3edb7c7b6033c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పెళ్లికి, కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే సమాజం మనది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. సహజీవనం (Living Together) పేరుతో కొన్ని జంటలు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇష్టం ఉంటే పెళ్లితో ఒక్కటవ్వుతున్నారు. లేకపోతే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అంతేకాదు.. ఇండియాలో డేటింగ్ యాప్స్(Dating Apps) కూడా బాగా పెరిగాయి. ఫలితంగా డేటింగ్ ద్వారా ఒక్కటవుతున్న జంటల సంఖ్య కూడా పెరిగింది. ఇదే క్రమంలో.. ‘వన్ నైట్ స్టాండ్’ (One Night Stand) ట్రెండ్ చాపకింద నీరులా సాగుతోంది. అయితే, ఇలాంటి రిలేషన్స్ వల్ల అప్పటికప్పుడు సంతోషం లభిస్తుంది. కానీ, వాటి వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకొనే ముందు డేటింగ్, వన్ నైట్ స్టాండ్ మధ్య వ్యత్యాసం గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.
డేటింగ్(Dating): ఒక తోడు కోసం చేసే ప్రయత్నం డేటింగ్. ఇలా కలిసేవారు ప్రేమించుకోవచ్చు. లేదా లైంగికంగా ఒకటి కావచ్చు. ఆ తర్వాత కూడా వారు మళ్లీ కలుస్తారు. షికారు చేస్తారు. కష్టసుఖాలను పంచుకుంటారు. ఒకరి కోసం ఒకరు తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. నచ్చితే సహజీవనం చేస్తారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలుసుకుంటే పెళ్లి చేసుకుంటారు. ఈ తరం యువతకు డేటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కాలేజీలు, స్కూళ్లలోనే ప్రేమ పుట్టేది. లేదా పొరిగింటి పిల్లలు, స్నేహితుల ఫ్రెండ్స్‌తో ప్రేమలో పడేవారు. కానీ, ఇప్పుడు అన్నీ ‘ఆన్‌లైన్’ ప్రేమలే. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తితో డేటింగ్ చేయడం. కొన్నాళ్లు సరదాగా గడపడం సాధారణమైపోయింది. డేటింగ్ యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో సింగిల్స్ ఖాళీగా ఉండటం లేదు. తమకు నచ్చిన వ్యక్తిని సెలక్ట్ చేసుకుని టైంపాస్ చేస్తున్నారు. కొందరు సిన్సియర్‌గా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే.. కొందరు మాత్రం అవసరాలు తీరిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే, డేటింగ్ వల్ల యువతలో పెళ్లిపై ఆసక్తి తగ్గిపోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నీ ముందే అయిపోవడం వల్ల పెళ్లి.. తోడు.. గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుందట.
వన్ నైట్ స్టాండ్(One Night Stand): ఇది డేటింగ్‌కు పూర్తి విరుద్దం. ఇది అపరిచితుల మధ్య జరిగే ‘లైంగిక’ ఒప్పందం. సింగిల్‌గా ఉండేవారు ఒక్కసారైనా శృంగార అనుభూతి పొందాలని అనుకుంటారు. తెలిసిన వ్యక్తులతో పాల్గొంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తారు. తమతో ఏకాంతంగా గడిపే వ్యక్తులు ఎలాంటి పరిచయం లేనివారై ఉండాలని కోరుకుంటారు. సెక్స్ తర్వాత వారితో ఎలాంటి సంబంధం కొనసాగించరు. దీనివల్ల భవిష్యత్తులో వారి వైవాహిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తారు. ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఆయా వ్యక్తుల అభిరుచిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది తెలిసిన వ్యక్తులతోనే ఒక ఒప్పందం ప్రకారం ఆ అనుభూతి పొందుతారు. మరికొందరు కొత్త వ్యక్తులతో కలుస్తారు. వారితో తిరిగి ఎలాంటి సంబంధం కొనసాగించరు. వారితో ఎమోషనల్‌గా కూడా దగ్గరవ్వరు. అవసరం తీరేవరకే క్లోజ్‌గా ఉంటారు.
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
అమ్మాయిలూ జాగ్రత్త: లైంగిక కోరికలు తీర్చుకోడానికి వేరే మార్గాలను ఆశ్రయించేవారు ఎక్కువ మందే ఉంటారు. అయితే, దానివల్ల డబ్బులు వేస్ట్ కావడమే కాకుండా ఆశించినంత సేపు ఎంజాయ్ చేయలేరనే కారణంతో ‘వన్ నైట్ స్టాండ్’పై మొగ్గు చూపుతున్నారు. ‘వన్ నైట్ స్టాండ్’ ద్వారా పరస్పర అంగీకారంతో ఎంత సేపైనా గడపవచ్చు. కానీ, దీనివల్ల కూడా సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులతో ఏకాంతంగా గడపడం అమ్మాయిలకు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ ఎవరితోనైనా ‘వన్ నైట్ స్టాండ్’ చేయాలని భావిస్తే వారికి సంబంధించిన పూర్తి వివరాలను ముందుగా తెలుసుకోవాలని అంటున్నారు. దీన్ని సీక్రెట్‌గా ఉంచాలనే కారణంతో కొందరు కనీసం స్నేహితులకు కూడా చెప్పడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు తమ క్లోజ్ ఫ్రెండ్‌తో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి. లేకపోతే.. సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అపరిచితులు సీక్రెట్‌గా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉంది. ‘వన్ నైట్ స్టాండ్’లో పాల్గొనే అమ్మాయిలు డిప్రషన్‌కు కూడా గురవ్వుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరైతే దీన్ని అలవాటుగా చేసుకుని తరచుగా అపరిచితులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారట. అయితే, డేటింగ్(Dating).. వన్ నైట్ స్టాండ్(One Night Stand)లో ఏది సేఫ్ అని అడిగితే.. రెండిట్లోనే సమస్యలుంటాయని చెప్పవచ్చు. కాబట్టి.. Be Safe.
గమనిక: డేటింగ్, వన్ నైట్ స్టాండ్ వల్ల కలిగే సమస్యలపై అవగాహన కలిగించేందుకే ఈ కథనాన్ని అందించామని గమనించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’కు ఎలాంటి బాధ్యత వహించదు.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)